ఇంటరాగేషన్ సెల్ గా మారిన హాస్పిటల్ బెడ్

ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన టీడీపీ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు ఇవాళ్టి నుంచి అసలు పరీక్ష ఎదురుకాబోతోంది. అచ్చెన్నాయుడ్ని ప్రశ్నించవచ్చంటూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈరోజు నుంచి 3 రోజుల పాటు…

ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన టీడీపీ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు ఇవాళ్టి నుంచి అసలు పరీక్ష ఎదురుకాబోతోంది. అచ్చెన్నాయుడ్ని ప్రశ్నించవచ్చంటూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈరోజు నుంచి 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడ్ని ప్రశ్నించబోతున్నారు. ఈ మేరకు జీజీహెచ్ లోని అచ్చెన్నాయుడి గది, ఇంటరాగేషన్ సెల్ గా మారబోతోంది.

అచ్చెన్నాయుడికి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఈరోజు డిశ్చార్జ్ చేయాలని కూడా హాస్పిటల్ భావించింది. ఈమేరకు అర్థరాత్రి డిశ్చార్జ్ సమ్మరీ కూడా సిద్ధమైంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆఖరి నిమిషంలో డిశ్చార్జ్ రద్దుచేశారు. బెడ్ పైనే అచ్చెన్నాయుడ్ని అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఏసీబీ అధికారులతో పాటు అచ్చెన్నాయుడు తరఫు లాయర్, ఓ వైద్యుడు ఇంటరాగేషన్ లో ఉంటారు.

మరికాసేపట్లో అచ్చెన్నాయుడు ఇంటరాగేషన్ మొదలవుతుంది. అయితే ఆయన సహకరిస్తారా లేదా అనే అనుమానాన్ని వ్యక్తంచేస్తున్నారు అధికారులు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, కాసేపు పడుకుంటానంటూ అచ్చెన్నాయుడు మొరాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. కోర్టు ప్రశ్నించడానికి పర్మిషన్ ఇచ్చినా అచ్చెన్నాయడి నుంచి సరైన సమాచారం రాబట్టడం కష్టం అంటున్నారు. ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి పూర్తిగా తమ కస్టడీలోకి ఇచ్చినప్పుడు మాత్రమే సమాచారం సేకరించడం కుదురుతుందని చెబుతున్నారు.

అయితే మరోవైపు మాజీ డైరక్టర్ రమేష్ కుమార్ ను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో అతడి ద్వారా మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉందని… రమేష్ ఇచ్చే సమాచారం ఆధారంగా అచ్చెన్నాయుడ్ని కార్నర్ చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఏదేమైనా కోర్టు కస్టడీకి అనుమతినిచ్చినా డిశ్చార్జ్ అవ్వకుండా హాస్పిటల్ లోనే ఉన్న అచ్చెన్నాయుడు.. ఆ మేరకు ఇంటరాగేషన్ ను పరోక్షంగా తప్పించుకున్నట్టే అంటున్నారు విశ్లేషకులు.

నిమ్మగడ్డ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు

పార్టీని ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనలేదు