స్కూటరే లేనివాడు భవనం ఎలా కట్టాడు?

మంత్రి జగదీష్ రెడ్డిపై మాజీ మంత్రి, భువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014లో మంత్రి జగదీశ్‌రెడ్డికి స్కూటర్‌ కూడా లేదని, అటువంటి వ్యక్తి నాగారంలో ప్రగతి భవన్‌ను మించిన…

మంత్రి జగదీష్ రెడ్డిపై మాజీ మంత్రి, భువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014లో మంత్రి జగదీశ్‌రెడ్డికి స్కూటర్‌ కూడా లేదని, అటువంటి వ్యక్తి నాగారంలో ప్రగతి భవన్‌ను మించిన భవనాన్ని నిర్మించుకున్నాడని ఆయన ఆరోపించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ మారిన దాఖలాలు లేవని, అక్రమ వ్యాపారాలు చేస్తున్న చరిత్ర లేదని చెప్పారు. మూడు దశాబ్దాలుగా నల్లగొండలో అద్దె ఇంట్లోనే ఉంటున్నానని గుర్తు చేశారు. తాను రాష్ట్ర సాధనకోసం మంత్రి పదవినే వదలుకున్నానని ఆయన గుర్తు చేశారు.

మునుగోడులో ప్రొటోకాల్‌పై ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారని.. తెలంగాణ ప్రభుత్వంలో ఒక పద్ధతి అంటూ లేదని మండిపడ్డారు. 

టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, పార్టీలు మారడం, అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు.