బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రెండో పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుసాన్ కు హృతిక్ కొన్నేళ్ల ముందు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కూడా ఆమెతో హృతిక్ సన్నిహితంగా కనిపించాడు. పిల్లల కోసం ఈ జంట కలిసేది.
అయితే కొంత కాలం కిందట సుసాన్ మరో ప్రేమబంధాన్ని బహిరంగ పరిచింది. హృతిక్, సుసాన్ లు మళ్లీ పెళ్లి చేసుకుంటారనే రూమర్లకు ఆమె అలా తెరదించారు. తన తదుపరి ప్రయాణం హృతిక్ తో కాదని, మరో ప్రేమ బంధంలోకి అడుగుపెడుతున్నట్టుగా సుసాన్ క్లారిటీ ఇచ్చింది.
ఇక సోలోగా కనిపించిన హృతిక్ కూడా కొంతకాలంగా మరో మహిళతో సాన్నిహితంగా కనిపిస్తున్నాడు. .ఆమె పేరు సబా అజాద్. నటి, థియేటర్ డైరెక్టర్. వయసు 31. హృతిక్ తో పోలిస్తే వయసులో చాలా చిన్నది. ఇంకా వివాహమేదీ కాలేదు.
ఈమె విషయంలో ఇటీవలే సుసాన్ కూడా స్పందించింది. ఒక సినిమాలో సబా నటనను ప్రశంసిస్తూ స్పందించింది సుసాన్. ఇప్పుడు సబా, హృతిక్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వీరి బంధం పెళ్లి దిశగా అడుగులేస్తోందా? అనే ఆసక్తి నెలకొని ఉంది.