ఏడాదిగా తెగని కేసు.. దొంగను పట్టించిన వాట్సాప్

కొన్ని కేసులు ఓ పట్టాన తేలవు. ఒక్క క్లూ కూడా దొరకదు. కానీ ఏదో ఒక రోజు సడెన్ గా క్లూ దొరుకుతుంది. కేసు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి…

కొన్ని కేసులు ఓ పట్టాన తేలవు. ఒక్క క్లూ కూడా దొరకదు. కానీ ఏదో ఒక రోజు సడెన్ గా క్లూ దొరుకుతుంది. కేసు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి కేసే. చిన్న వాట్సాప్ స్టేటస్ తో ఏడాదిగా నలుగుతున్న ఈ కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.

హైదరాబాద్ లోని రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నివశిస్తున్న సాయికిరణ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో డబ్బు, నగలు దొంగతనం చేశారు. దీనిపై గతేడాది జులై 12న పోలీసులకు ఫిర్యాదుచేశాడు సాయికిరణ్. అయితే పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. అలా ఆ కేసుపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.

ఇదిలా ఉండగా.. సాయికిరణ్ పక్కింట్లో ఉండే ఓ మహిళ ఫుల్లుగా ముస్తాబై తన ఫొటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంది. ఆ స్టేటస్ ను సాయికిరణ్ చూశాడు. అందులో మహిళ ధరించిన నగలపై అనుమానం వచ్చింది అతడికి. వెంటనే వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు, తమదైన స్టయిల్ లో విచారించేసరికి మహిళ నిజం ఒప్పుకుంది. సదరు మహిళ కొడుకు జితేందర్, ఈ దొంగతనానికి పాల్పడిన విషయం బయటపడింది. అలా ఓ వాట్సాప్ స్టేటస్ తో ఏడాదికి పైగా నలుగుతున్న చోరీ కేసు కొలిక్కి వచ్చింది.

బాబు చేస్తే స్వాధీనం, వైసీపీ చేసే విధ్వంసం అట