బ్యాంకుల్లో నగదు లావాదేవీలు ఎక్కువగా చేయడం నిషేధం. కంపెనీలు ఏమైనా పేమెంట్లు చేయాలంటే చెక్ ల ద్వారా లేదా ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ల ద్వారా చేయాల్సి వుంటుంది.
కానీ తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు నేరుగా నగదునే పది వేల వంతున పంపిణీ చేసింది. చేస్తోంది. అది కూడా అధికార పార్టీ ప్రదినిధులు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ జనాల్లో బోలెడు అసంతృప్తి, ధర్నాలు, గోల.
ఇలాంటి పరిస్థితి ఆంధ్రలో జరిగివుంటే… గతంలో ఓ స్కీము విషయంలో ఇలాగే వైకాపా నాయకులు రంగంలోకి దిగితే తెలుగుదేశం అను'కుల'మీడియా నానా యాగీ చేసింది.
ప్రభుత్వ కార్యక్రమంలో వీరి జోక్యం ఏమిటంటూ గోల గోల చేసింది. ఇప్పుడు ఆంధ్రలో ఇదే విధంగా పార్టీ ప్రతినిధుల ద్వారా, అది కూడా నగదురూపంలో ఏదైనా స్కీముకు అందించే ప్రయత్నం చేసి వుంటే సీన్ ఎలా వుండేదో ఊహించుకోవచ్చు.
నగదు అందలేదని, స్వాహా చేసేసారనీ,చిలక్కొట్టుళ్లు కొట్టారనీ, అసలు నగదు ఇవ్వడం ఏమిటనీ? అసలు పార్టీకి ఏం పని అని నానా వార్తలు కనిపించేవి. కానీ తెలంగాణలో మాత్రం మూతికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నారు.
జనాలు ధర్నా చేసినా సైలంట్ అయ్యారు. నిజంగా కేసిఆర్ గొప్పోడు. ఈ దేశం అను'కుల' మీడియాను మోకాళ్ల మీద కూర్చో పెట్టగలిగారు.