క‌రోనా కేసుల్లో ఇండియా స‌రికొత్త వ‌ర‌ల్డ్ రికార్డు!

ఒకే రోజు 80 వేల కేసుల‌తో క‌రోనా వ్యాప్తి విష‌యంలో స‌రి కొత్త రికార్డును సృష్టించింది ఇండియా. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచంలో ఏ దేశంలోనూ ఒకే రోజు ఈ స్థాయిలో క‌రోనా కేసులు రికార్డు…

ఒకే రోజు 80 వేల కేసుల‌తో క‌రోనా వ్యాప్తి విష‌యంలో స‌రి కొత్త రికార్డును సృష్టించింది ఇండియా. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచంలో ఏ దేశంలోనూ ఒకే రోజు ఈ స్థాయిలో క‌రోనా కేసులు రికార్డు కాలేదు. ఆగ‌స్టు 30న ప‌ది ల‌క్ష‌ల టెస్టులు జ‌ర‌గ‌గా వారిలో 80 వేల మందికి క‌రోనా పాజిటివ్ గా తేలింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

అమెరికాలో ఒకే రోజు 77 వేల స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. అది కూడా ఇప్పుడు కాదు. చాన్నాళ్ల కింద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ అదే ఒకే రోజు ఒక దేశంలో న‌మోదైన అత్య‌ధిక కేసులు రికార్డుగా ఉండేది. అయితే ఇండియాలో గ‌త రెండు మూడు రోజుల నుంచి అంత‌కు మించి కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న ఆ నంబ‌ర్ 80 వేల‌కు చేరిన‌ట్టుగా తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో రిక‌వ‌రీల సంఖ్య దాదాపు 60 వేలుగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 20 వేల వ‌ర‌కూ పెర‌గ‌డం గ‌మ‌నార్హం.

ఇండియాలో క‌రోనా వ్యాప్తి పెరుగుతున్నా దాదాపు అన్నింటికీ గేట్లు ఎత్తేస్తున్నారు. అంత‌రాష్ట్ర ప్ర‌య‌ణాల నిబంధ‌న‌లూ.. ఇలాంటి వాట‌న్నింటినీ ప్ర‌భుత్వ‌మే ఎత్తేసింది. గ‌వ‌ర్న‌మెంటు రూల్స్ పెడితేనే వాటిని జ‌నాలు పాటించ‌డం క‌ష్టం. అలాంటి ప్ర‌భుత్వ‌మే పూర్తిగా నిబంధ‌న‌ల‌ను ఎత్తేయ‌డంతో జ‌నాల వేగం మ‌రింత పెరిగింది. ఈ నేప‌థ్యంలో కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంద‌ని స్ప‌ష్టం అవుతోంది. 

ప్ర‌స్తుతం మూత‌లో ఉన్న‌ది  ఐటీ కంపెనీలు- ఇవి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ తో బండి లాగిస్తున్నాయి. పాఠ‌శాల‌లు – ప్రైవేట్ స్కూళ్ల వాళ్లు టీచ‌ర్ల‌ను స్కూల్ కు ర‌మ్మంటూ ఒత్తిళ్లు చేస్తున్నాయ‌ట‌, ఆన్ లైన్ క్లాస్ ల‌ను స్కూళ్ల నుంచి చెప్ప‌మ‌ని అంటున్నాయ‌ట‌. పూర్తిగా మూత‌బ‌డ్డ‌ది మాత్రం కేవ‌లం థియేట‌ర్లు. బ‌హుశా క‌రోనాకూ ముందు క‌రోనా వ్యాప్తి త‌ర్వాత‌.. ప్ర‌స్తుతం ఉన్న తేడాలు ఇవే. సెప్టెంబ‌ర్ లో దేశ వ్యాప్త ఎంట్ర‌న్స్  టెస్టుల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. సెప్టెంబ‌ర్ రెండో వారం వ‌రకూ ఎంట్ర‌న్స్ టెస్టులు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇలా ప్ర‌భుత్వం పూర్తిగా గేట్ల‌ను ఎత్తేస్తోంది.

పవన్ సార్ గురించి ఏం చెప్పాలి