కరోనా సిటీ నుంచి భారత్ కు 324 మంది

చైనాలోని వూహాన్ సిటీని ఇప్పుడంతా కరోనా సిటీగా పిలుస్తున్నారు. కరోనా వైరస్ అక్కడే పుట్టడంతో దీనికి ఆ పేరు వచ్చేసింది. అలాంటి నగరం నుంచి 324 మంది భారతీయులు ఇండియా వచ్చారు. ఈరోజు ఉదయం…

చైనాలోని వూహాన్ సిటీని ఇప్పుడంతా కరోనా సిటీగా పిలుస్తున్నారు. కరోనా వైరస్ అక్కడే పుట్టడంతో దీనికి ఆ పేరు వచ్చేసింది. అలాంటి నగరం నుంచి 324 మంది భారతీయులు ఇండియా వచ్చారు. ఈరోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. వాళ్లనీ ఎవ్వర్నీ కదలనివ్వలేదు. ఎయిర్ పోర్ట్ సమీపంలోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరాలకు వాళ్లను తరలించారు. 2 వారాల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత ఇంటికి పంపిస్తారు.

వూహాన్ లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చే క్రమంలో నిన్న ఎయిరిండియా విమానం అక్కడికి చేరుకుంది. అందులో 324 మంది భారతీయులు ఢిల్లీకి వచ్చారు. వీళ్ల కోసం విమానంలో ప్రత్యేక మాస్కులు ఉంచారు. ఎవరి సీట్లలో వాళ్లకు మాస్కులు, ఆహారం, పానీయాలు ఉంచారు. విమాన సిబ్బంది ఎవ్వరూ వీళ్లను కలవలేదు. అలా మాస్కులతో దిగిన వీళ్లంతా ప్రత్యేక శిబిరాల్లోకి వెళ్లారు.

వుహాన్ లో ఇంకా ఇండియన్స్ ఉన్నారు. వాళ్ల కోసం ఈరోజు మరో ప్రత్యేక విమానం వూహాన్ వెళ్తోంది. అలా ఇండియాకు తీసుకొచ్చిన ఇండియన్స్ అందర్నీ ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. కరోనా లక్షణాలు బయటపడ్డానికి కనీసం 2 వారాలు పడుతుంది. అందుకే వాళ్లను 2 వారాల పాటు ప్రత్యేకంగా ఉంచబోతున్నారు. అవసరమైతే మరికొన్ని రోజులు అదనంగా కూడా ఉంచుతారు.

చైనాలో మృతుల సంఖ్య ఇప్పటికే 260 దాటింది. దాదాపు 2వేల మంది కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడుండడం మంచిది కాదంటూ వివిధ దేశాలు తమ దేశస్తుల్ని స్వదేశానికి రప్పిస్తున్నాయి. మరోవైపు కేరళలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. అతడ్ని కూడా 2 వారాల పాటు ప్రత్యేక శిబిరంలోనే ఉంచుతారు.

మరో పెళ్లిచూపులు