మావోల నడ్డి విరిగినట్లేనా… ?

తృటిలో తప్పించుకున్నారు కానీ మావోల అగ్ర నేతలు కూడా లిస్ట్ లో ఉండాల్సిందే అన్నది పోలీసుల కధనం. విశాఖ ఏజెన్సీలో తాజాగా జరిగిన ఎదురు కాల్పులలో ఏకంగా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. Advertisement అదే…

తృటిలో తప్పించుకున్నారు కానీ మావోల అగ్ర నేతలు కూడా లిస్ట్ లో ఉండాల్సిందే అన్నది పోలీసుల కధనం. విశాఖ ఏజెన్సీలో తాజాగా జరిగిన ఎదురు కాల్పులలో ఏకంగా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

అదే విధంగా గత ఏడాదిగా ఇక్కడ పోలీస్ పట్టు పెరిగింగి. వరసపెట్టి కూంబింగ్ నిర్వహిస్తూ మావోల స్థావరాలను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. మావోలకు కొన్నేళ్ల క్రితం వరకూ విశాఖ ఏజెన్సీ బలమైన కేంద్రంగా ఉండేది. 

అంతవరకూ ఎందుకు.. 2018లో ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యేను పొట్టన పెట్టుకుని మావోలు సంచలనం సృష్టించారు. అంతకు ముందు వరకూ చూస్తే వరసగా ప్రజా ప్రతినిధులు అనేకమంది మావోల దెబ్బకు బలి అయ్యారు.

ఇపుడు సీన్ మారుతోందా అన్నదే చర్చగా ఉంది. మావోలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యం చేయడంలో పోలీసులు సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో గతంలో ఉన్న పట్టు కూడా వారికి లేదని స్పష్టమవుతోంది. 

ఒక్క ఏడాది కాలంలో ఏడు నుంచి ఎనిమిది మంది కీలక నేతలను కోల్పోయిన మావోలకు ఆంధ్రా ఓడిషా బోర్డర్ లో దెబ్బ మీద దెబ్బలే తగులుతున్నాయి.

విశాఖ జిల్లా పోలీస్ అధికార యంత్రాంగ ఒక ప్రణాళిక ప్రకారం ఏజెన్సీలో మావోలకు చెక్ పెడుతూ వస్తోంది అంటున్నారు. మరో వైపు చూస్తే మావోయిస్టులలో చాలా మంది ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలసిపోయారు. 

ఉన్న వారు కూడా తీవ్రమైన వ్యాధులతో బాధలు పడుతున్నారు. దాంతో పోలీసుల జల్లెడకు వారు దొరికేస్తున్నారు అంటున్నారు. ఏది ఏమైనా ఒకనాటి మావోల కంచుకోటకు నేడు బీటలు వారుతోంది అని పోలీసుల చేతలు నిరూపిస్తున్నాయనుకోవాలి.