సస్పెండైన జడ్జి రామకృష్ణ ను చిత్తూరు జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించారు. చిత్తూరు జైల్లో తన తండ్రికి ప్రాణహాని ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామికి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు నేపథ్యంలో జైలు మార్పిడి జరిగింది.
తన తండ్రి బ్యారక్‌కు వచ్చిన మరో ఖైదీ బెదిరింపులకు పాల్పడ్డారని లేఖలో ప్రస్తావించారు. బెదిరించిన వ్యక్తి వద్ద కత్తి కూడా దొరికిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ లేఖపై స్పందించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ….రామకృష్ణకు ప్రాణహానిపై ఏం చెబుతారని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. రామకృష్ణను మరో బ్యారక్‌కు మార్చినట్టు వెల్లడించారు. దీంతో ఆయన్ను పీలేరు సబ్‌జైలుకు తరలింపు విషయం తెలిసొచ్చింది. పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదిలా వుండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల నరుకుతానని ఓ చానల్ డిబేట్‌లో సస్పెండైన జడ్జి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రామకృష్ణపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయడం, ఏప్రిల్‌లో అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.
జైల్లో ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. జైల్లో తనకు ప్రాణహాని ఉందంటూ గత మూడు రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో… పీలేరు సబ్ జైలుకు ఆయన్ని తరలించారు. మరి అక్కడైనా కుదురుగా ఉంటారా? లేక మరో కొత్త సమస్యను సృష్టిస్తారా? …సోషల్ మీడియాలో నెటిజన్ల అనుమానాలివి.