ఆ విషయంలో మోడీ కంటే ముందున్న జగన్

లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత పొడిగించుకుంటూ పోవడమే తప్ప మినహాయింపులివ్వడంలో ప్రధాని నరేంద్రమోదీ అంత త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనేది వాస్తవం. కరోనా కష్టకాలంలో వలసకూలీలు బాధపడుతున్నా.. వారిని పక్కనపెట్టి విదేశాల నుంచి వచ్చినవారు, ఇతర…

లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత పొడిగించుకుంటూ పోవడమే తప్ప మినహాయింపులివ్వడంలో ప్రధాని నరేంద్రమోదీ అంత త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనేది వాస్తవం. కరోనా కష్టకాలంలో వలసకూలీలు బాధపడుతున్నా.. వారిని పక్కనపెట్టి విదేశాల నుంచి వచ్చినవారు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థుల తరలింపుకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిచ్చింది. కానీ జగన్ అలాకాదు, కరోనా కట్టడితో పాటు.. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేంద్రం మినహాయింపులివ్వకముందే.. రాష్ట్రంలో వ్యవసాయ పనులకి ఆటంకం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. కూలీలకు కూడా ఇబ్బందులు లేకుండా చేశారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయిస్తూనే.. వారి జీవనోపాధికి అడ్డంకులు లేకుండా చూస్తున్నారు.

ఇక వలసకూలీల వ్యధని ఆలకించడంలో కూడా మోదీ కంటే ముందున్నారు ఏపీ సీఎం. ఏపీలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్ జోన్ టు గ్రీన్ జోన్ ప్రయాణాలుుండేలా అధికారులతో చర్చించారు. అంటే గ్రీన్ జోన్ లో చిక్కుకుపోయిన వలస కూలీల స్వస్థలాలు కూడా గ్రీన్ జోన్ లో ఉంటే వారిని అక్కడికి తరలిస్తారు. 

వీరికోసం ఉచితంగా బస్సుల్ని సిద్ధం చేస్తున్నారు. సీటింగ్ కెపాసిటీలో సగం మందిని మాత్రమే బస్సులోకి ఎక్కించుకుంటారు. అన్నిరకాల పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉండేందుకు సిఫార్సు చేస్తారు. కనీసం సొంతవాళ్లకు దగ్గరగా ఉన్నామన్న సంతోషంతో అయినా వలస కూలీలు ఆర్థిక కష్టాలను మరచిపోగలుగుతారు. అందుకే వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు కేంద్రం కంటే ముందుగానే నిర్ణయం తీసుకున్నారు జగన్.

అయితే రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కు, గ్రీన్ జోన్ నుంచి రెడ్ జోన్ కు ప్రయాణాలు అనుమతించరు. రాష్ట్రంలోని 676 మండలాలకు గాను 559మండలాలు గ్రీన్ జోన్ లోనే ఉన్నాయి. కేవలం 117 మండలాల్లో మాత్రమే కరోనా వ్యాపించి ఉంది. అంటే.. మిగతా మండలాల్లో సాధారణ పరిస్థితులే ఉన్నాయన్నమాట. కరోనా బూచి చూపించి మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రజల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తే.. వారిలో నైరాశ్యం నెలకొంటుంది. అందుకే జగన్ ఓ అడుగు ముందుకేశారు. వలస కూలీలను కుటంబాలకు దగ్గర చేస్తున్నారు.

అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ

అబ్బా కొడుకులు ఎక్కడ దాక్కున్నారు ?