ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రా జిల్లాలకు ప్రాధాన్యత పెరిగింది. మాటల కంటే చేతలకే జగన్ ప్రాధాన్యత ఇస్తారన్నది విధితమే. దానికి తగినట్లుగా ఆయన చర్యలు కూడా ఉంటున్నాయి.
ఓవైపు విశాఖను పాలనారాజధానిగా ప్రకటించిన జగన్ దానికి తగినట్లుగా అన్ని హంగులూ సమకూరుస్తున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రాకు తాగు, సాగు నీటి కోసం ఉద్దేశించిన ఉత్రారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని స్పెషల్ పర్పస్ వెహికిల్ కింద పూర్తి చేయాలని కూడా జగన్ అధికారులను తాజాగా ఆదేశించారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్రాలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు కూడా నీళ్ళు ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. అదే విధంగా పోలవరం ఎడమ కాలువ నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా విశాఖకు తాగునీటి అవసరాలు తీర్చే విషయాన్ని పరిశీలించాలని కూడా జగన్ అదేశించడం కూడా హర్షణీయం.
ఇక విశాఖకు తరలి వచ్చే ఈ నీటిని కేవలం గ్రావిటె ద్వారానే రప్పించాలని కూడా చూస్తున్నారు. అందువల్ల విద్యుత్ ఖర్చు కూడా ఉండదు. కేవలం పంపింగ్ ద్వారానే ఈ నీటిని తరలిస్తారు.
వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్న సుజల స్రవంతి కనుక పూర్తి అయితే ఉత్తరాంధ్రా జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. స్పెషల్ పర్పస్ వెహికిల్ కింద నిధులను మంజూరు చేసి దాన్ని టైం బాండ్ లోగా పూర్తి చేయాలని జగన్ సర్కార్ ఆలోచన చేయడాన్ని ఉత్తరాంధ్రా వాసులు స్వాగతిస్తున్నారు.