నిరుద్యోగులకు జగన్ నుంచి మరో తీపివార్త

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నిరుగ్యోగులు పండగ చేసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు సీఎం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో శుభవార్త మోసుకొచ్చారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీఈడీ…

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నిరుగ్యోగులు పండగ చేసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు సీఎం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో శుభవార్త మోసుకొచ్చారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీఈడీ అభ్యర్థుల కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది జగన్ సర్కార్. ఏకంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

ఇకపై ఉద్యోగ కాలెండర్ నియమిస్తామని, ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉంటుందో చూసుకొని, ఆ క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగులు పరీక్షలకు సన్నద్ధం కావొచ్చని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనవరిలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమౌతున్నారు. ఇప్పుడు దీనికి అదనంగా ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు.

నిజానికి నేరుగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే దీనిపై చాలా కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అలా అని బీఈడీ చేసిన వాళ్లను అలా వదిలేయదలుచుకోలేదు ముఖ్యమంత్రి. వాళ్లకు ఉపాధి కల్పిస్తూనే, విద్యా ప్రమాణాల్ని పెంచేలా అకడమిక్ ఇన్ స్ట్రక్టర్లు అనే కొత్త ఉద్యోగాల్ని సృష్టించబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే 7వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పడబోతోంది.

వచ్చేనెల జనవరిలో మరోసారి కొలువుల భర్తీ జాతరకు సిద్ధమౌతోంది ఏపీ సర్కార్. పోలీస్ డిపార్ట్ మెంట్, గ్రూప్-2, గ్రూప్-4, అటవీశాఖల్లో దాదాపు 20వేల పోస్టుల భర్తీకి సిద్ధమౌతోంది. దీంతో పాటు గ్రామ/వార్డ్ సెక్రటరీ పోస్టుల భర్తీకి కూడా మరోసారి నోటిఫికేషన్ పడబోతోంది.