ప‌వ‌న్‌కు అర్థం కావాలంటే ర‌ష్య‌న్ భాష‌లో చెప్పాలేమో?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలుగులో చెబితే ఏదీ అర్థమ‌య్యేలా లేదు. ఇంగ్లీష్‌లో చెప్పాల‌నుకుంటే త‌న‌కు ఆ భాష అర్థం కాకే ఇంట‌ర్ ఫెయిల‌య్యాన‌ని ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించాడు. ప‌వ‌న్ మాట‌ల్లో తిక్కో, లెక్కో తెలియ‌దు కానీ,…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలుగులో చెబితే ఏదీ అర్థమ‌య్యేలా లేదు. ఇంగ్లీష్‌లో చెప్పాల‌నుకుంటే త‌న‌కు ఆ భాష అర్థం కాకే ఇంట‌ర్ ఫెయిల‌య్యాన‌ని ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించాడు. ప‌వ‌న్ మాట‌ల్లో తిక్కో, లెక్కో తెలియ‌దు కానీ, ఆయ‌నేం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే అర్థం కాలేద‌న్న‌ది వాస్త‌వం. దేశ వ్యాప్తంగా ఉల్లి స‌మ‌స్య ఉంది. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ దృష్టిలో కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రమే ఉల్లి స‌మ‌స్య ఉంది.

“ఉల్లి కోసం ప్ర‌జ‌లు గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో నిల‌బ‌డాల్సి రావ‌డం ప్ర‌భుత్వ చేతకాని త‌నానికి నిద‌ర్శ‌నం. వైసీపీ ప్ర‌భుత్వం నిత్యావ‌స‌రాల‌ను అందించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. మ‌త‌మార్పిళ్లు, కూల్చివేత‌లు, కాంట్రాక్టుల ర‌ద్దుపై జ‌గ‌న్ పెట్టిన దృష్టి ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌పై, రైతుల క‌ష్టాల‌పై పెట్టి ఉంటే బాగుండేది” అని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో జ‌గ‌న్ స‌ర్కార్‌పై మండిప‌డ్డాడు.

స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం, వాటి ప‌రిష్కారానికి పోరాటాల ద్వారా ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్ల‌డం మంచిప‌నే. కానీ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే దేశ వ్యాప్తంగా ఉల్లి కొర‌త ఏర్ప‌డింద‌నే రీతిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంది. జ‌గ‌న్‌పై ట్వీట్లు ఇవ్వ‌డానికి ఉన్న ధైర్యం…మోడీ స‌ర్కార్ అస‌మ‌ర్థ‌త‌పై  స్పందించ‌డానికి ఎందుకు భ‌య‌ప‌డుతున్న‌ట్టో?

దేశంలో ఉల్లి కొర‌త లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల‌ను సైతం కుదిపేసింది. ఆర్థిక‌మంత్రి నిర్మ‌ల సైతం తాను ఉల్లి తిన‌నే తిన‌ని చెప్ప‌డం ఆయ‌న చెవికెక్క‌లేదా? జ‌గ‌న్ గురించి జాతీయ మీడియా ఏం రాస్తోంది, ఏం చెబుతోందో ట్విట‌ర్‌లో షేర్ చేస్తున్న ప‌వ‌న్‌కు…మోడీ స‌ర్కార్‌పై వ‌స్తున్న‌వేవీ క‌నిపించ‌లేదా? వినిపించ‌లేదా? ఏపీలో లేని మ‌త‌మార్పిళ్లు మాత్రం ఆయ‌న ఒక్క‌డికే క‌నిపిస్తున్నాయి. కేంద్ర స‌ర్కార్‌పై హిందీ, ఇంగ్లీష్‌లో వ‌స్తున్న రాత‌లు అర్థం కావ‌డం లేదా?  అవున్లేండి మీకు అవేవి అర్థం కావు. త‌మ‌రు ర‌ష్యా దేశస్తురాలు లెజ్నెవోను పెళ్లి చేసుకున్న‌ప్ప‌టి నుంచి భార‌తీయ భాష‌లు మ‌రిచిన‌ట్టున్నాడు. మీకు రష్యా భాష‌లో చెబితే త‌ప్ప ఏవీ అర్థం కావు.