మ‌రోసారి పెద్ద మ‌న‌సు చాటుకున్న జ‌గ‌న్‌

సాయం అందించ‌డంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు మ‌రెవ‌రూ సాటి రారు. ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న‌లో బాధితుల‌కు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయ‌లు సాయం అందించి శ‌భాష్ అనిపించుకున్నారు. ఇలా…

సాయం అందించ‌డంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు మ‌రెవ‌రూ సాటి రారు. ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న‌లో బాధితుల‌కు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయ‌లు సాయం అందించి శ‌భాష్ అనిపించుకున్నారు. ఇలా అనేక ఉదంతాల గురించి చెప్పుకోవ‌చ్చు. 

తాజాగా ఓ ప్ర‌భుత్వ వైద్యుడి వైద్య ఖ‌ర్చుల‌కు వెంట‌నే కోటి రూపాయ‌లు మంజూరు చేసి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. అంతేకాదు, స‌ద‌రు ప్ర‌భుత్వ వైద్యుడి పూర్తి వైద్య ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని సీఎం ప్ర‌క‌టించారు. శ్రీ‌కాకుళం జిల్లా క‌విటి మండ‌లం కొత్త‌పుట్టుగ‌కు చెందిన డాక్ట‌ర్ ఎన్‌.భాస్క‌ర్‌రావు ప్ర‌కాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారి. 

ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు సుమారు 6 వేల మందికి కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాడు. పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన వారికి మెరుగైన వైద్య సేవ‌లందించి ప్రాణ‌దాత‌గా నిలిచారు. ఏప్రిల్ 24న ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. నెలాఖ‌రు వ‌ర‌కూ హోమ్ ఐసోలేష‌న్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. 

అక్క‌డ ప‌ది రోజులు వైద్యం తీసుకున్నా ఫ‌లితం కాన‌రాలేదు. దీంతో వెంట‌నే ఆయ‌న్ను హైద‌రాబాద్ య‌శోదా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం గ‌చ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బ‌తిన్నాయ‌ని, అందువ‌ల్లే శ్వాస స‌మ‌స్య వ‌చ్చింద‌ని వైద్యులు తెలిపారు. వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్న ఆయ‌న‌కు ఊపిరితిత్తులు మార్చాల‌ని వైద్యులు తేల్చారు. ఇందుకు రూ.1.50 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని ఆస్ప‌త్రి నిర్వాహ‌కులు తెలిపారు. అయితే అంత పెద్ద‌మొత్తంలో ఖ‌ర్చు పెట్టుకుని వైద్యం తీసుకునే స్తోమ‌త స‌ద‌రు వైద్యుడి కుటుంబానికి లేదు.

ఈ నేప‌థ్యంలో మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డిని వైద్యుడి కుటుంబ స‌భ్యులు క‌లిసి ప‌రిస్థితిని వివ‌రించారు. వెంట‌నే ఆయ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంట‌నే స్పందించి వైద్యుడి వైద్య ఖ‌ర్చుల‌కు కోటి రూపాయ‌లు చెల్లించాల‌ని, అవ‌స‌ర‌మైతే మిగిలిన సొమ్మును కూడా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు. 

ఈ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారులు సీఎం ఆదేశించారు. దీంతో వైద్యుడి కుటుంబం ఊపిరి పీల్చుకుంది. మిగిలిన కోవిడ్ వారియ‌ర్స్ విష‌యంలోనూ జ‌గ‌న్ ఇదే రీతిలో స్పందిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.