నిజమే ప్రేమలోని వెచ్చదనాన్ని అస్వాదించేవారికే దాని విలువ మర్యాద తెలుస్తాయి. జగన్ విషయంలో ప్రత్యర్ధులు ఏమనుకున్నా ఆయనను దగ్గరుండి చూసిన వారు కానీ ఆయన ప్రేమను అనుభవించిన వారు కానీ చెప్పే మాట ఇదే.
జగన్ మనుషుల పట్ల ఎంత కేర్ గా ఉంటారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ ఈ మధ్యనే కరోనాతో మృతి చెందారు.
ఆయన అంటే జగన్ కి ఎందుకో చాలా ఇష్టం. ఆ మాటకు వస్తే ద్రోణంరాజు కుటుంబంతో వైఎస్ కుటుంబానిది మాటలకు అందని అనుబంధం. ఇక శ్రీనివాస్ ఇలా పార్టీలో చేరారో లేదో అలా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్. ఆ తరువాత ఆయన స్వల్ప తేడాతో ఓడినా కూడా క్యాబినెట్ ర్యాంక్ పదవి అయిన విఎమ్మార్డీయే చైర్మన్ ఇచ్చి గౌరవించారు. ఇది నిజంగా మరో ఆశ్చర్యమైన విషయం.
ఇవన్నీ పక్కనపెడితే దాదాపుగా నెలరోజుల పాటు ద్రోణంరాజు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కరోనాతో పోరాడారు. ఈ సందర్భంగా జగన్ ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికపుడు అన్నీ తెలుసుకుంటూ వచ్చారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నా కూడా ఆయన కుమారుడు శ్రీవాత్సవకు తరచూ ఫోన్ చేసి మరీ ఒక బంధువుగా మారి అన్ని రకాలైన జాగ్రత్తలు చెప్పారట.
దీన్ని స్వయంగా శ్రీ వాత్సవ్ తండ్రి సంతాప సభలో చెబుతూ జగన్ ది స్వచ్చమైన ప్రేమ అంటూ ఎమోషన్ అయ్యారు. తమ కుటుంబం పట్ల ఆయన చూపించిన అభిమానం మరువలేనిది అన్నారు.
తన తండ్రిని కోల్పోయినా జగన్ అభిమానం దక్కడం మాత్రం అదృష్టమేనని చెప్పుకున్నారు. మొత్తానికి జగన్ మీద బయట రాతలు ఎలా ఎవెరెన్ని రాసినా ఆయన వ్యక్తిత్వం ఏంటన్నది పదే పదే ఇలాంటి ఘటనల ద్వారా రుజువు అవుతూనే ఉంది.