జ‌గ‌న్ సీరియ‌స్‌!

శ‌త్రువుగా భావించే ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీనికి కార‌ణం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌ను ఉద్దేశ పూర్వకంగా ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ వాయిదా వేస్తున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావించ‌డ‌మే. …

శ‌త్రువుగా భావించే ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీనికి కార‌ణం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌ను ఉద్దేశ పూర్వకంగా ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ వాయిదా వేస్తున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావించ‌డ‌మే. 

పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌ను కూడా వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌ని సీఎం జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఎన్నిక‌లు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జ‌గ‌న్ కోర‌డం వెనుక ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలేదు. త్వ‌ర‌గా ఎన్నిక‌లు పూర్తి చేస్తే క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు.

ప్ర‌ధాని మోడీతో జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. అనంత‌రం ఆయ‌న అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు రాష్ట్రంలో స్థానిక సంస్థ‌లు అడ్డు ప‌డ్డాయ‌న్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా పంచాయ‌తీ, పుర‌పాల‌క ఎన్నిక‌లు పూర్త‌య్యాయ‌న్నారు. వీటి త‌ర్వాత వెంట‌నే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు కూడా చేప‌ట్టి ఉంటే బాగుండేద‌ని ఆయ‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై గవర్నర్‌, హైకోర్టుకు నివేదించాలని అధికారుల‌కు  సీఎం సూచించారు. ఈ నేప‌థ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌ను ఉద్దేశ పూర్వ‌కంగా ఆల‌స్యం చేయ‌డంపై ప్ర‌భుత్వంపై సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. 

అందువ‌ల్లే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు న్యాయ‌స్థానం నుంచి అనుమ‌తి తెచ్చుకున్న త‌ర్వాత బాధ్య‌త‌ను ప‌రిపూర్ణంగా నెర‌వేర్చ‌కుండా తాత్సారం చేయ‌డంపై హైకోర్టు, గ‌వ‌ర్న‌ర్‌ దృష్టికి తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. దీంతో నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారంపై ఫిర్యాదు చేసేందుకు అత్యున్న‌త స్థాయి అధికారులు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్