ఉద్యోగుల విషయంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా వ్యవహరించారు? ఈ ఒక్క ప్రశ్నను ఉద్యోగులంతా తమకుతాము వేసుకోవాలి. ఆందోళన చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టించిన ఘనత చంద్రబాబుది. ఉద్యమం చేస్తున్న ఉద్యోగుల్ని పోలీసు జీపుల్లో కుక్కి స్టేషన్ కు తరలించిన చరిత్ర ఆయనది.
అంతెందుకు.. తమ న్యాయమైన డిమాండ్లు అడిగినందుకు తోకలు కత్తిరిస్తానంటూ మీడియా కెమెరాల సాక్షిగా వార్నింగ్ ఇచ్చిన ఘటనను ఎవ్వరైనా మరిచిపోగలరా? ఓవైపు ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు ఎల్లో మీడియాలో 'ఎస్మా ప్రయోగం' అంటూ పెద్ద హెడ్డింగ్ లు పెట్టిన పేపర్ క్లిప్పింగులు ఉద్యోగులకు ఇంకా గుర్తే.
అదే ఉద్యోగులు ఇప్పుడు మరోసారి ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు. కానీ గతంలో చంద్రబాబు చేసిన లాంటి పనులేవీ ముఖ్యమంత్రి జగన్ చేయలేదు. పైపెచ్చు, ఈరోజు కేబినెట్ మీటింగ్ లో ఉద్యోగుల్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
“ఆందోళనలో పాల్గొన్న ఏ ఒక్క ఉద్యోగిపైనా కేసులు పెట్టకండి. ఆందోళన చేయడం వారి హక్కు.”
ఇవాళ్టి సమావేశంలో ఉద్యోగులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఉద్యోగులపై ఉన్న సాఫ్ట్ కార్నర్ ను, ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. జగన్ ను సమర్థించడం ఇక్కడ ఉద్దేశం కాదు, ఆయన మనసుకును అర్థం చేసుకోమని కోరుతున్నారు మంత్రులు.
గతంలో చంద్రబాబు పాలనకు, జగన్ వ్యవహారశైలికి తేడా గుర్తించమని మాత్రమే అడుగుతున్నారు. చంద్రబాబు జమానాలో సరిగ్గా ఇలాంటి కేబినెట్ మీటింగ్స్ వేదికగానే బాబు హెచ్చరికలు చేసేవారు.
ఏ వర్గానికి అన్యాయం చేయాలని కోరుకోరు సీఎం జగన్. ఏ ఉద్యోగిని నష్టపరచడం, చంద్రబాబులా కించపరచడం జగన్ కు ఇష్టం ఉండదు. ఎటొచ్చి ఉద్యోగులు కాస్త సంయమనంతో ఉండాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడా పరిస్థితి చేయిదాటిపోయింది.
సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగులు
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ చేసి, 7వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగులు నిర్ణయించారు. విజయవాడలోని ఎన్జీవో హాల్ లో సమావేశమైన పలు ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమ కార్యాచరణ ప్రకటించాయి.
ఈనెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాయి. అంతేకాకుండా.. 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25న ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి.