జ‌గ‌న్ పీకింది ఏంటంటే…

ఈ ముఖ్య‌మంత్రి (వైఎస్ జ‌గ‌న్‌)కి క‌నీసం ఇంగిత జ్ఞానం ఉందా…లేక సైకోనా? అనే అనుమానం వ‌స్తోంది. జ‌గ‌న్ ఫేక్ సీఎం. త‌ప్పుడు మ‌నుషులు. త‌ప్పుడు ప్ర‌భుత్వం. గాలి మాట‌లు, సొల్లు క‌బుర్లు …ఇవి ఓ…

ఈ ముఖ్య‌మంత్రి (వైఎస్ జ‌గ‌న్‌)కి క‌నీసం ఇంగిత జ్ఞానం ఉందా…లేక సైకోనా? అనే అనుమానం వ‌స్తోంది. జ‌గ‌న్ ఫేక్ సీఎం. త‌ప్పుడు మ‌నుషులు. త‌ప్పుడు ప్ర‌భుత్వం. గాలి మాట‌లు, సొల్లు క‌బుర్లు …ఇవి ఓ మాజీ ముఖ్య‌మంత్రి, 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌శాలైన నారా చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో ప‌లికిన ప‌లుకులు.

అంతేనా, సాక్ష్యాత్తు చ‌ట్ట‌స‌భైన అసెంబ్లీలో ఏం పీకుతారో పీక్కోండి అని పోడియం ఎదుట కూచుని నానా యాగీ చేయ‌డాన్ని చూశాం. తానే అధికారంలో శాశ్వతంగా ఉంటాన‌ని క‌ల‌లు క‌న్న చంద్ర‌బాబును, అధికార పీఠం నుంచి జ‌గ‌న్ పీకి ప‌డేశారు. అంతేనా, క‌నీసం గౌర‌వ ప్ర‌ద‌మైన ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డానికి కూడా త‌గినంత మంది స‌భ్యులు లేకుండా ప్ర‌జ‌ల్లో బాబు ప‌లుకుబ‌డిని పీకి ప‌డేశారు. 

ప్ర‌జ‌ల్లో బాబుపై విశ్వ‌స‌నీయ‌ను పీకి ప‌డేసిన ఘ‌న‌త జ‌గ‌న్‌ది. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం అని గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబు రాజ‌కీయ కోర‌ల‌ను పీకి ప‌డేశారు. ఇంకా ఆయ‌న ఏం పీకించుకోవాల‌ని కోరుకుంటున్నారో తెలియ‌డం లేదు. మ‌రి ఆయ‌న‌కైనా ఆ విష‌యంలో క్లారిటీ ఉందో లేదో మ‌రి.

అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట చంద్ర‌బాబు మాట‌లు వింటే… ఇంత‌కూ రాజ‌కీయ చ‌ర‌మాంకంలో చంద్ర‌బాబుకు ఏమైంద‌నే అనుమానం ఎవ‌రికైనా రాక మాన‌దు. ఎదుటి వాళ్ల స‌భ్య‌త , సంస్కారం గురించి నీతులు వ‌ల్లించే చంద్ర‌బాబు …తాను పాటిస్తున్న విలువ‌లేంటో ఒక్క‌సారి అంత‌రాత్మ‌ను ప్ర‌శ్నించుకోవాలి. 

ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెడితే, క‌నీసం త‌న మ‌న‌సు చెప్పే మాటైనా చంద్ర‌బాబు విన‌గ‌లిగే సంస్కారాన్ని చంద్ర‌బాబు పోగొట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన మాన‌సిక స్థితిగా మాన‌సిక, రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఎక్క‌డైనా ఫేక్ సీఎం ఉంటారా? జ‌గ‌న్ ఫేక్ అయితే, మ‌రి త‌మ‌రి సంగ‌తేంట‌ని ప్ర‌త్య‌ర్థులు ప్ర‌శ్నించ‌రా? ఇదేనా గౌర‌వాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డం అంటే?  రాజ‌కీయంగా, చ‌ట్ట‌స‌భ‌లో స‌భ్యుడిగా అంద‌రి కంటే సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబు ముందుగా తాను ప్ర‌త్య‌ర్థుల‌తో గౌర‌వంగా మెల‌గాలి. అప్పుడు మాత్రం వాళ్ల నుంచి గౌర‌వ మ‌ర్యాద‌లు ఆశించే హ‌క్కు ఉంటుంది. 

ప్ర‌స్తుత త‌న దీన‌స్థితికి గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు చ‌ట్ట‌స‌భ‌లో నెల‌కొల్పిన విలువ‌ల ప‌ర్య‌వ‌సానాలే అని చంద్ర‌బాబుకు బాగా తెలుసు.

చంద్రబాబుకు అల్జీమర్స్ జబ్బుంది: కొడాలి నాని