అవును జగన్ గెలిచారు. తాను అనుకున్న విషయంలో కచ్చితంగా విజయ శిఖరాన్నే అధిరోహించారు. ఆయన సీఎం గా కుర్చీలో కూర్చుని గట్టిగా 27 నెలలు కూడా కాకుండానే సర్కారీ పాఠశాలల తలరాతలు మార్చేశారు.
ఒకపుడు ప్రభుత్వ బడులు అంటే చాలా చిన్న చూపు ఉండేది. అక్కడ చదివేవారు బీదలు, సాదలు అన్న చులకన భావన ఉండేది. దాన్ని పూర్తిగా జగన్ తుడిచిపెట్టేశారు. జగన్ దేశంలోనే ఎక్కడా లేని విధంగాఏపీలో విద్యా రంగానికి పెద్ద ఎత్తున బడ్జెట్ లో నిధులు కేటాయించారు. ఫలితంగా ఇపుడు ప్రైవేట్ స్కూళ్ళు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతున్నాయి.
గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడైనా కల గనని అనేక విషయాలు కూడా ఇపుడు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో సీట్లు లేవు అడిమిషన్స్ క్లోజ్ అన్న బోర్డులు పెట్టడం ఎవరైనా ఇప్పటిదాకా చూసారా. కానీ అది జరిగింది. విజయనగరంలోని కార్పోరేషన్ పాఠశాలలో సీట్లు అన్నీ ఫుల్ అంటూ బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు. ఈ విద్యాసంవత్సరానికి కొత్తగా ఎవరికీ అడ్మిషన్లు లేవు అంటూ కూడా నోటీసు బోర్డులో పెట్టేశారు.
విజయనగరంలోని కొత్తపేటలో ఉన్న కేవీ గొల్ల పాఠశాలలో ఇలా బోర్డులు పెట్టడం నిజంగా అద్భుతంగానే అంతా చూస్తున్నారు. నాడు నేడు లో భాగంగా ఈ స్కూల్ ని చక్కగా తీర్చిదిద్దారు. తరగతి గదులలలో ఏసీలు కూడా అమర్చారు.
నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. నిష్ణాతులైన సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు. దాంతో ఇక్కడ తమ బిడ్డలను చదివించాలని తల్లితండ్రులు క్యూ కడుతున్నా సీట్లు లేవు అంటున్నారు. ఇదే విధంగా ఈ జిల్లాల్లో చాలా ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి ఉంది. మొత్తానికి జగన్ అనుకున్నది సాధించారు, గెలిచారు అంటున్నారు విద్యారంగానికి చెందిన మేధావులు.