జనసేన చాప చుట్టేసినట్లే…!

జనసేన పార్టీ 2019 తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగినపుడు అనుకున్నంతగా ఊపు లేకపోయినా మూడవ ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ రేసులో ఉంటుందని భావించి చాలా మంది మేధావులు అందులో చేరారు. అలా వచ్చిన వారిలో…

జనసేన పార్టీ 2019 తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగినపుడు అనుకున్నంతగా ఊపు లేకపోయినా మూడవ ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ రేసులో ఉంటుందని భావించి చాలా మంది మేధావులు అందులో చేరారు. అలా వచ్చిన వారిలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ‌ ఒకరు.

నిజానికి ఆయన పవన్ తో సరిసమానంగా  ఏపీ జనాలకు బాగా తెలిసిన నాయకుడు. ఆయన రంగంలో ఆయనే  హీరో. దీనికి తోడు మేధావులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న విశాఖలో జేడీ ఎంపీగా పోటీ చేసారు. ఆయనకు 2 లక్షల 80 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇందులో పవన్ చరిష్మా ఎంతని పక్కన పెడితే జేడీ సొంత ఇమేజ్ కూడా  బాగా ఉపయోగపడిందని చెప్పాలి.

దానికి నిదర్శనం మిగిలిన అసెంబ్లీ సీట్లలో జనసేనకు వచ్చిన ఓట్లు అన్నీ కలిపినా కూడా జేడీకి వచ్చిన ఓట్లకు సరికాదు. అంటే జేడీని ప్రత్యేకంగా విశాఖ జనం గుర్తించి ఆదరించారనుకోవాలి. దాంతో జేడీ తాను సొంతంగానే విశాఖ జిల్లాలో  సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన  తన స్వచ్చంద సంస్థ ద్వారా మరికొన్నాళ్ళు ఇలాగే విశాఖలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు.

ఆ తరువాత ఆయన తన ఆలోచనలను బట్టి మరో రాజకీయ పార్టీలో చేర అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక జేడీ విశాఖ నగరం స్వచ్చ సర్వేలో మొదటి ర్యాంక్ సాధించాలని పిలుపు ఇవ్వడం విశేషం. అంటే రానున్న రోజుల్లో తన కార్యక్షేత్రం విశాఖ అని జేడీ చెప్పకనే చెప్పారన్నమాట. జేడీ జనసేనని వీడడం  పార్టీకి భారీ లోటు, కానీ జేడీ ఒక వ్యక్తిగా, వ్యవస్థగా ఇప్పటికీ తాను విశాఖవాసులతోనే పయనిస్తానని చెబుతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే జనసేన ఓడిపోయాక మాజీ ఐఆరెస్ అధికారి, అనకాప‌ల్లి నుంచి జనసేన ఎంపీగా పోటీ చేసి ఓడిన పార్ధసారధి పార్టీకి మొదట్లొనే  గుడ్ బై కొట్టేసారు. అదే  విధంగా మాజీ మంత్రి, పాడేరు నుంచి పోటీ చేసిన పసుపులేటి బాలరాజు కూడా గుడ్ బై అనేశారు.

ఇక ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2019లో పెందుర్తి నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓడిన చింతలపూడి వెంకటరామయ్య కూడా జనసేనకు రాం రాం అనేశారు. ఇలా చాలా మంది జనసేనకు వీడిపోయారు. జేడీ లాంటి బిగ్  షాట్ పార్టీకి షాక్ ఇవ్వడంతో పరిపాలనా రాజధాని విశాఖలో జనసేన చాపచుట్టేసినట్లేనని అంటున్నారు.

వాళ్లిద్దరూ నన్ను ఎలా పడేయాలా అని చూసారు