జేసీ జూనియర్లు కామ్‌గా.. సీనియర్‌ మాత్రం అతిగా!

తను రాజకీయాల నుంచి ఇప్పటికే రిటైర్డ్‌ అయినట్టుగా ప్రకటించుకున్నారు జేసీ దివాకర్‌ రెడ్డి. ఆ మేరకు ఇటీవలి ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. ఆయన తనయుడు ఎంపీగా పోటీచేశారు. ఓడిపోయారు. ఈ లెక్కన…

తను రాజకీయాల నుంచి ఇప్పటికే రిటైర్డ్‌ అయినట్టుగా ప్రకటించుకున్నారు జేసీ దివాకర్‌ రెడ్డి. ఆ మేరకు ఇటీవలి ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. ఆయన తనయుడు ఎంపీగా పోటీచేశారు. ఓడిపోయారు. ఈ లెక్కన ఇప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి కామ్‌గా ఉండిపోవాల్సింది. ఎందుకంటే ఆయనే రిటైర్మెంట్‌ను ప్రకటించారు కాబట్టి.

ఇక ఎన్నికల్లో పోటీచేసి జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీనేతగా స్పందించాల్సింది. అనంతపురం ఎంపీ సీటు పరిధిలో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి రంగంలోకి దిగాల్సింది. అయితే.. జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి రాకీయంగా ఎలాంటి హడావుడి చేయడంలేదు!

ఆయన మీడియా ముందుకు రావడంలేదు, కార్యకర్తల వద్దకు రావడంలేదు. తమవర్గాన్ని కాపాడుకోవడానికి రాలేదు. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ పొలిటీషియన్‌గా ప్రచారం పొందిన జేసీ పవన్‌ ఇప్పుడు మొహం చాటేశారు. ఆరంగేట్రంలోనే ఎంపీగా ఓటమి పాలైపోయి, తిరస్కరణ పొందిన ఆయన ఇప్పుడు యాక్టివ్‌ పాలిటిక్స్‌లో కనిపించడం లేదు.

రిటైర్మెంట్‌ ప్రకటించిన జేసీ దివాకర్‌ రెడ్డి మాత్రం మళ్లీ హడావుడి మొదలుపెట్టారు. తననకు అలవాటైన రాజకీయాలే చేస్తూ ఉన్నారు. అయితే జేసీ కూడా ప్రభుత్వంపై వీరలెవల్లో విరుచుకుపడటం  లేదు. జగన్‌ తమ వాడేనంటూ ప్రకటించుకుంటున్నారు. తన బస్సుల వ్యవహారాలను భూతద్దంలో చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేస్తూ ఉన్నారు. చూసీ చూడనట్టుగా పోవాలని విన్నవించుకుంటున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే.. జగన్‌ తమవాడని చెప్పుకుంటున్నారు.

అయితే దివాకర్‌ రెడ్డి కథ ఇంతటితో అయిపోలేదని, ఇంకా చాలా వ్యవహారాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. భారీఎత్తున భూములు పొందిన బాగోతాలున్నాయని.. వాటిని కూడా జగన్‌ ప్రభుత్వం త్వరలోనే కదిలించనుందనే ప్రచారం సాగుతూ ఉంది.

ఆంధ్రా రాజకీయం.. ఈవారం స్పెషల్ 'గ్రేట్ ఆంధ్ర' పేపర్