ఆయన ఏపీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్. చెప్పుకోవాలంటే ఆరో వేలు లాంటి పదవి అది. ఎందుకంటే చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నా జిల్లా, మండల నేతలతో నేరుగా మాట్లాడుతారు, అన్నీ ఆయనే అయి చూసుకుంటారు.
దాంతో కళా పదవి ఒక అలంకారప్రాయమేనన్న మాట ఉంది. సరే ఏదో పదవి ఉంది కదాని కళా అపుడపుడు తల వాయిస్ వినిపిస్తున్నారు. ఇపుడు ఆయన ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదుట.
ఒకనాడు శాసించే యువత ఇపుడు యాచించే స్థితిలోకి వచ్చిందట. జగన్ నమ్మించి మోసం చేశారని కళా అంటున్నారు. అవన్నీ సరే కానీ ఏపీలో నాలుగు లక్షల వరకూ గ్రామ సచివాలయాల ఉద్యోగాలు వైసీపీ సర్కార్ కొత్తగా స్రుష్టించి భర్తీ చేసిన సంగతి కళాకు తెలియదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ఒక్క జాబ్ కూడా ఇవ్వని సంగతిని కళా మరిచారా అని కూడా నిలదీస్తున్నారు. కళావి ఊసుపోని మాటలు గా కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా సీనియర్ మోస్ట్ లీడర్, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయిన కళా వెంకటరావుకు వైసీపీని విమర్శించేందుకు కూడా సరైన సబ్జెక్ట్ కరవు అయిందా అని సెటైర్లు మాత్రం పడుతున్నాయి. కళా ఏదో విమర్శ చేయాలి అన్నట్లుగా కాకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని వైసీపీ నేతలు కోరుకోవడంలో తప్పు లేదేమో.