కర్ణాటక: అవిశ్వాసంతో కథకు ముగింపు?

రెబెల్స్ ఎవరూ సంకీర్ణ ప్రభుత్వం దారిలోకి రావడం లేదు! అనర్హత వేటు అని అధికార కూటమి హెచ్చరిస్తున్నా వారు ఎవరూ పట్టించుకోవడం లేదు. వారి రాజీనామాలు సరైన ఫార్మాట్లో లేవని స్పీకర్ తేల్చారు. వారు…

రెబెల్స్ ఎవరూ సంకీర్ణ ప్రభుత్వం దారిలోకి రావడం లేదు! అనర్హత వేటు అని అధికార కూటమి హెచ్చరిస్తున్నా వారు ఎవరూ పట్టించుకోవడం లేదు. వారి రాజీనామాలు సరైన ఫార్మాట్లో లేవని స్పీకర్ తేల్చారు. వారు ఒక్కొక్కరుగా తనను వచ్చి కలిసి రాజీనామాల విషయంలో వివరణ ఇవ్వాలని ఆయన ప్రకటించారు.

ఇలా రాజీనామాల ఆమోదం విషయంలో స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించుకుని కుమారస్వామి సర్కారును కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే కుమారస్వామి సర్కారు మైనారిటీలోకి పడిపోయింది. 

భారతీయ జనతా పార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి రెడీ అవుతోంది. అసలు ఎమ్మెల్యేల రాజీనామాలు అన్నీ బీజేపీ ప్రోద్బలమే అనే అభిప్రాయాలున్నాయి. అంతా బీజేపీ స్కెచ్ ప్రకారమే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కుమారస్వామి సర్కారుపై బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని  ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

అవిశ్వాస తీర్మానం ఓటింగ్ వరకూ రావడం ఖాయంగా, అప్పుడు కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం కచ్చితంగా.. అని అంటున్నారు పరిశీలకులు. అయితే అప్పుడు కూడా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండదు. ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందినా, వారిపై అనర్హత వేటు పడినా.. మళ్లీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అందుకే  కొంత కాలం పాటు కర్ణాటకలో రాష్ట్రపతి పాలన పెట్టి, అనుకూలంగా ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో బీజేపీ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.