Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇస్మార్ట్ గా తప్పించుకున్న దిల్ రాజు

ఇస్మార్ట్ గా తప్పించుకున్న దిల్ రాజు

కొన్నిరోజుల కిందటిమాట. పూరి జగన్నాధ్ తీసిన మెహబూబా సినిమాను దిల్ రాజు ప్రత్యేకంగా వీక్షించాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, తనకు బాగా నచ్చిందని, అందుకే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను తను తీసుకుంటున్నానని ప్రకటించాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో మెహబూబా సినిమాను విడుదల చేసిన దిల్ రాజు, అపారమైన నష్టాల్ని చవిచూశాడు.

దిల్ రాజుకు నష్టాలు కొత్తకాదు. తట్టుకోగలడు. కానీ మెహబూబా సినిమాను మెచ్చుకుంటూ మాట్లాడిన మాటలు, అతడి ఇమేజ్ ను దెబ్బతీశాయి. ఆ ప్రభావం ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాపై పడింది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయమని దిల్ రాజును కోరాడు పూరి జగన్నాధ్. కానీ దిల్ రాజు మాత్రం నో చెప్పేశాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాను కనీసం నైజాంలో కూడా పంపిణీ చేయడానికి ఇష్టపడలేదు దిల్ రాజు. అంతేకాదు, సినిమాను చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ప్రస్తుతం తనకు చాలా ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయని, వీలుపడదని చెప్పేసి తప్పించుకున్నాడు. కానీ దిల్ రాజు వెనక్కి తగ్గడానికి కారణం మెహబూబా సినిమా అనే విషయం తెలిసిందే.

ప్రస్తుతానికైతే రామ్ తరఫు నుంచి స్రవంతి రవికిషోర్ రంగంలోకి దిగారు. దిల్ రాజుతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు కూడా ఫెయిల్ అయితే నిర్మాతలు మరో బయ్యర్ ను వెదుక్కోవాల్సిందే. మరో 10 రోజుల్లో సినిమా థియేటర్లలోకి రాబోతోంది. కానీ థియేట్రికల్ బిజినెస్ మాత్రం ఇంకా పూర్తికాలేదు.

పూరి జగన్నాధ్, రామ్ ట్రాక్ రికార్డుతో ఈ సినిమాను కొనేందుకు ట్రేడ్ అంతగా ఆసక్తి చూపడంలేదు. ఉన్నంతలో నిర్మాతలు పూరి జగన్నాధ్, చార్మికి ఊరట కలిగించే అంశం ఏదైనా ఉందంటే.. అది ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడమే. జీ తెలుగు ఛానెల్ ఈ హక్కులు దక్కించుకుంది.

దెయ్యాన్ని పట్టుకోవడానికి పోలీసును పిలవడం ఏంటి రాజా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?