సెమిస్ మ్యాచ్.. ఏం జరిగితే ఏమవుతుంది?

ఆట కాకుండా… వరుణుడే వరల్డ్ కప్ విజేతను నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లండ్ లో ప్రపంచకప్ కు మొదటి నుంచి వరణుడి ఆటంకాలు కొనసాగుతూ ఉన్నాయి. సెమిస్ మ్యాచ్ లు రెండింటికీ వర్షం ఆటంకం…

ఆట కాకుండా… వరుణుడే వరల్డ్ కప్ విజేతను నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లండ్ లో ప్రపంచకప్ కు మొదటి నుంచి వరణుడి ఆటంకాలు కొనసాగుతూ ఉన్నాయి. సెమిస్ మ్యాచ్ లు రెండింటికీ వర్షం ఆటంకం తప్పదని వాతావరణ శాఖ వారు చెబుతూనే వచ్చారు. అలాగే జరుగుతూ ఉంది.

రెండో రోజు అయినా సెమిస్ మ్యాచ్ సవ్యంగా సాగుతుందా? అనేది సందేహంగానే మారింది. రాత్రి కురిసి ఉండే వర్షాన్ని బట్టి.. మ్యాచ్ జరగడమా? ఆగడమా? అనేది ఆధారపడి ఉంటుంది. ఔట్ ఫీల్డ్ నిన్ననే పూర్తిగా చిత్తడి అయ్యింది. ఎండ విరగ్గాస్తే తప్ప మ్యాచ్ జరిగే పరిస్థితి ఉండకపోవచ్చు.

మ్యాచ్ ను పరిమిత ఓవర్ల కుదించి, డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆడించే అవకాశాలు లేకపోలేదు. అయితే అలాచేసినా వాతావరణంలోని తేమను కివీస్ బౌలర్లు సద్వినియోగం చేసుకుని ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ను కట్టడి చేసే అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. బాగా ఎండకాస్తే మాత్రం కివీస్ నిర్దేశించే లక్ష్యాన్ని చేధించడం కష్టం ఏమీ కాదంటున్నారు.

ఇక ఈ మ్యాచ్ రెండోరోజు కూడా భారీ వర్షం వచ్చి రద్దు అయితే మేలని భారత వీరాభిమానులు అనుకుంటున్నారు. అదే జరిగి ఇండియా ఫైనల్ కు ఎంటర్ అయినట్టే. పాయింట్ల పట్టికలో టీమిండియా నంబర్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ రద్దు అయినా ఇండియా ఫైనల్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.   

దెయ్యాన్ని పట్టుకోవడానికి పోలీసును పిలవడం ఏంటి రాజా