అమరావతిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై స్పందించిన కేసీఆర్, రాజధాని నిర్మాణాన్ని డెడ్ ఇన్వెస్ట్ మెంట్ అన్నారు. ఆదివారం శాసనసభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై స్పందించిన కేసీఆర్, రాజధాని నిర్మాణాన్ని డెడ్ ఇన్వెస్ట్ మెంట్ అన్నారు. ఆదివారం శాసనసభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. అమరావతిపై ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సంచలనం అయ్యాయి.

“ఎత్తిపోతలకు కరెంట్ బిల్లు వేస్ట్ అని జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆయనది తెలంగాణ కాదు. కానీ ఇదంతా బాగాలేదు, వేస్ట్ అంటాడు. ఏపీలో 53వేల కోట్ల రూపాయలతో అమరావతి కడుతుంటే దానికి మాత్రం డప్పుకొడతాడు. అది డెడ్ ఇన్వెస్ట్ మెంట్. ఆ విషయం నేను అప్పుడే చెప్పాను. అమరావతి కట్టకు, వేస్ట్ అని చంద్రబాబుకు అప్పుడే చెప్పాను. దాని బదులు రాయలసీమకు నీళ్లు ఇవ్వమని చెప్పాను. కానీ చంద్రబాబు నా మాట వినలేదు, కట్టుకుంటానన్నాడు. ఇప్పుడేమైందో అంతా చూస్తున్నాం.”

ఇలా అమరావతి నిర్మాణం అంటూ చంద్రబాబు వేల కోట్ల రూపాయలు వృధా చేశారని విమర్శించారు కేసీఆర్. రాజధాని కంటే రాయలసీమకు నీళ్లిచ్చే అంశంపై దృష్టిపెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణంపై కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అమరావతి నిర్మాణం జరగదంటూ ఆయన కామెంట్స్ చేశారు.

ఎన్నికల ప్రచారం సమయంలో అమరావతి నిర్మాణంపై కేసీఆర్ స్పందించారు. అమరావతి పేరుచెప్పి వేల కోట్ల రూపాయల్ని చంద్రబాబు దారి మళ్లిస్తున్నారని, ఏపీ ప్రజలు ఆ విషయాన్ని తెలుసుకునే రోజు అతి దగ్గర్లోనే ఉందని, గత ఎన్నికల టైమ్ లో కేసీఆర్ ఆరోపించారు. ఇప్పుడు మరోసారి అమరావతిపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

తన భయం.. రాష్ట్రంపై రుద్దితే ఎలా?