ఈసారి కేసీఆర్ Vs కోర్టు

మొన్నటివరకు కేసీఆర్, కార్మికుల మధ్య లొల్లి నడిచింది. కేసీఆర్ డెడ్ లైన్ విధించారు, కార్మికులు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు వ్యవహారం కేసీఆర్-కోర్టుకు మధ్య చేరింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ను కార్మిక సంఘాలు సవాల్…

మొన్నటివరకు కేసీఆర్, కార్మికుల మధ్య లొల్లి నడిచింది. కేసీఆర్ డెడ్ లైన్ విధించారు, కార్మికులు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు వ్యవహారం కేసీఆర్-కోర్టుకు మధ్య చేరింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ను కార్మిక సంఘాలు సవాల్ చేశాయి. దీంతోపాటు ప్రైవేటుపరం చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా కార్మికులు కోర్టులో సవాల్ చేశారు.

ఆర్టీసీ ఆర్థిక లావాదేవీలపై చర్చ కంటే, తాజాగా దాఖలైన పిటిషన్ పై వాదనలే ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తున్నామని, ఇది కేబినెట్ తీసుకున్న నిర్ణయమని, దీన్ని కోర్టులు కూడా మార్చలేవంటూ రెచ్చగొట్టారు కేసీఆర్. దీనిపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈరోజు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసే అధికారం కోర్టుకు ఉందా? ఒకవేళ అలాంటి ఆదేశాలు వస్తే అప్పుడు కేసీఆర్ ఏం చేస్తారనేది ప్రశ్న.

మరోవైపు ఆర్టీసీ ఆస్తులు, కేటాయించిన నిధులపై కోర్టుకు సమర్పించిన వివరాల్లో తప్పులున్నాయని కోర్టు ప్రభుత్వాన్ని ఆక్షిపేంచింది. దీనిపై మరింత సమగ్రంగా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నిన్ననే మరో అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. దాదాపు గతంలో సమర్పించిన లెక్కలే ఉన్నాయి. కాకపోతే ఈసారి రివర్స్ లో ఆర్టీసీనే ప్రభుత్వానికి 453 కోట్లు బకాయి ఉందని అఫిడవిట్ లో పేర్కొంది.

మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీనే ప్రభుత్వానికి 453 కోట్లు చెల్లించాలని పేర్కొంది. అక్కడితో ఆగకుండా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ రవాణా శాఖ నుంచి ఆర్టీసీకి నోటీసు కూడా వెళ్లింది. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది మరింత పెనుభారం కానుంది. దీంతో ఈ వివాదంపై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు కార్మికులు మాత్రం తమ సమ్మెను పూర్తిస్థాయిలో కొనసాగిస్తున్నారు. ఈరోజుతో సమ్మె 34వ రోజుకు చేరింది. కార్మికులంతా ధర్నాలో పాల్గొంటున్నారు. సమ్మెను వదిలి విధులకు హాజరైన కార్మికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విధుల్లోకి చేరిన వ్యక్తుల ఫొటోల్ని రోడ్లపై తగలబెడుతున్నారు. మరోవైపు సమ్మె కారణంగా ఓ కార్మికులు మతిస్థిమితం కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోకు చెందిన నాగేశ్వర్ అనే కార్మికుడు.. తీవ్ర ఆందోనళకు గురై మతిస్థిమితం కోల్పోయాడు.