కేంద్రంలో ఏకైక తెలుగు మంత్రి జి కిషన్ రెడ్డి. ఆయనకు ఈ మధ్యనే పర్యాటక శాఖ లభించింది. ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది.
ఇవన్నీ ఇలా ఉంటే కేంద్ర క్యాబినేట్ మంత్రి హోదాలో తొలిసారిగా కిషన్ రెడ్డి ఈ నెల మొదటి వారంలో ఏపీకి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని విశాఖ రావాలని కూడా కొన్ని సంఘాలకు చెందిన నేతలు ఆహ్వానించారు. దానికి ఆయన సరేనన్నారు కూడా.
ఏపీలో టూరిజం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యల మీద కూడా కిషన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతే కాదు విశాఖను టూరిజం హబ్ గా మార్చడానికి కేంద్ర మంత్రి కృషి చేస్తారని అంటున్నారు.
ఇక విశాఖ పర్యటనలో కిషన్ రెడ్డి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి కిషన్ రెడ్డి గతంలో చాలా సార్లు విశాఖ వచ్చారు కానీ ఈసారి ఆయన టూర్ మాత్రం ప్రత్యేకమైనది. దీని వల్ల విశాఖను మేలు జరిగితే మంచిదే అంటున్నారు.