స్థానిక ఎన్నికలకు రెవిన్యూ ఉద్యోగులు నో?

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తొందరపడుతోంది. ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలంటున్నారు. ఇక దీని మీద అటు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా లేదని ఎటూ  క్లారిటీగా చెబుతోంది. Advertisement…

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తొందరపడుతోంది. ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలంటున్నారు. ఇక దీని మీద అటు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా లేదని ఎటూ  క్లారిటీగా చెబుతోంది.

మరో వైపు స్థానిక ఎన్నికలు ఇప్పట్లో వద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల సంఘాన్ని గట్టిగా కోరుతున్నారు. రాష్ట్ర రెవిన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది సమయం కాదని అంటున్నారు.

ఈ విషయంలో ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. కరోనాకు బలి అయిన వారిలో ఎక్కువ మంది రెవిన్యూ ఉద్యోగులు ఉన్నారని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.

వ్యాక్సిన్ వచ్చేంతవరకైనా ఎన్నికలను వాయిదా వేయాలని కూడా ఆయన కోరుతున్నారు. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే తొందరలో ఎన్నికలు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల సంగ్రామంలో ముందుండే ఉద్యోగులే నో చెబుతున్న వేళ ఆయన పునరాలోచన చేస్తారా.

అధికార పార్టీలో అదే చర్చ