అన్ని మాటలూ చెప్పి.. ఒక్క మాటలో చెప్పడం అన్నట్టుగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియాపై ఒక రేంజ్ లో మరోసారి విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని, ఒక మాట మాత్రం గట్టిగా చెప్పారు. అదేమిటంటే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆయన జన్మలో ఇక సీఎం కాలేడని కొడాలి నాని అన్నారు.
తెలుగుదేశం అనుకూల మీడియా ఈ విషయంలో ఎంత కష్టపడినా ప్రయోజనం లేదని, వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత బురద జల్లాలని చూసినా ఉపయోగం లేదని, వారు కోరుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఇక మరోసారి సీఎం అయ్యే అవకాశాలు లేవని కొడాలి నాని తేల్చి చెప్పారు.
తప్పుడు వార్తలు రాసి, అసంబద్ధమైన కథనాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలని టీడీపీ అనుకూల మీడియా తన ప్రయత్నాలను కొనసాగిస్తోందన్నట్టుగా కొడాలి నాని మాట్లాడారు. అయితే వీటి వల్ల వారికి కూడా ఉపయోగం లేదన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలతో జగన్ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీయాలనేవన్నీ విఫల యత్నాలే అవుతాయని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
ఇక యథారీతిన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొడాలి. చంద్రబాబు తీరును ఖండిస్తూ రకరకాల అంశాలను ప్రస్తావించారు. పలు ఉదాహరణలను ప్రస్తావించారు. అన్నీ చెప్పి, ఒక్క మాటలో చెబుతూ చంద్రబాబు నాయుడు ఇక మళ్లీ సీఎం కావడం మాత్రం జరిగే పని కాదని వ్యాఖ్యానించారు.