మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడలో తన కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించి, గోవా సంస్కృతిని ఆంధ్రాకు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు ఇవాళ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్లడంపై కొడాలి నిప్పులు చెరిగారు.
చంద్రబాబుకు, ఆయనకు డబ్బా కొట్టే చానళ్లకు చాలెంజ్ విసురుతున్నట్టు తెలిపారు. తన కల్యాణ మండపం రెండున్నర ఎకరాల్లో ఉంటుందన్నారు. కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించినట్టు నిరూపిస్తే రాజకీయాలను వదిలేసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే ఈ కులకుక్కలు చంద్రబాబు, ఆయన తొత్తులు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు టైమ్ అయిపోయిందన్నారు.
నిజనిర్ధారణకు ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య, ప్రజల చేతిలో తిరస్కారానికి గురై విజయవాడలో మహిళలను వేధించిన చెత్త నాయకులందరినీ గుడివాడకు పంపి రచ్చ చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు సిగ్గుశరం లేదని ఘాటు విమర్శలు చేశారు. ఏవో కొన్ని రికార్డింగ్ డ్యాన్స్‌లు అని చూపించి తన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగినట్టు చూపారని ఆరోపించారు. అన్ని చోట్ల జరిగినట్టే కోడిపందేలు, జూదం గుడివాడలో కూడా జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.
తన కన్వెన్షన్ సెంటర్‌లో మహిళలతో డ్యాన్స్ వేయిస్తున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయనే సమాచారం రాగానే… తానే డీఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. ఐదారు గంటల్లో కార్యక్రమాలు నిలుపుదల చేయించామన్నారు. దానికి క్యాసినో అని, ఇంకా ఏవేవో పేర్లు పెట్టారని నాని మండిపడ్డారు. చంద్రబాబు కాదు, ఆయన బాబు ఖర్జూరపునాయుడు వచ్చినా గుడివాడలో తన చేతిలో వెంట్రుక కూడా పీకలేరని చూపిస్తూ నాని అన్నారు. మీడియా, గుడివాడ ప్రజలు వెళ్లి నిజనిర్ధారణ చేసుకోవచ్చన్నారు.
అమ్మాయిల్ని అడ్డం పెట్టుకుని బతికే చరిత్ర తెలుగుదేశం పార్టీది అని కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రోజు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌కు ద్రోహం చేసి సీఎం పదవి లాక్కున్న వ్యక్తి చంద్రబాబునాయుడు అని నాని విరుచుకుపడ్డారు. అలాగే అమ్మాయిని అడ్డు పెట్టుకుని సైకిల్ గుర్తు సంపాదించుకున్న బ్రోకర్ చంద్రబాబు అని కొడాలి తీవ్ర అభ్యంతరకర విమర్శ చేశారు. అలాగే ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం పెళ్లాన్ని రోడ్డు మీదకు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు చేశారు.
హెరిటేజ్ సంస్థ ఓ వ్యభిచార కొంప అని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు అనుమతిస్తే ఓ పది మందితో నిజనిర్ధారణ కమిటీగా వెళ్లి చూపుతామన్నారు. అది గుడివాడ అని, ఎవరొచ్చినా ఏమీ చేసుకోలేరని స్పష్టం చేశారు. కావాలనే ఇదంతా చంద్రబాబు డ్రామా ఆడిస్తున్నారని కొడాలి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ప్రాణం ఉన్నంత వరకూ కన్వెన్స్ సెంటర్‌లోకి టీడీపీ వాళ్లును అడుగు పెట్టనివ్వనని తేల్చి చెప్పారు.
బ్లాక్ కమెండో సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుకు చేతనైతే తన కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చేందుకు ప్రయత్నించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌కు అమ్మాయిలతో సంబంధాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.