వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు, ఈ మేరకు ప్రభుత్వం, అధికారులు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిన్న ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
నిమ్మగడ్డ ప్రకటనపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యర్థులపై కొడాలి నాని విమర్శల ప్రవాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఒరవడి మరోసారి నిమ్మగడ్డపై కొనసాగింది.
కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సిగ్గు లేకుండా , చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గు చేటన్నారు.
కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరన్నారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థతో పాటు ప్రభుత్వంపై నమ్మకం లేదని మండిపడ్డారు.
రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. రిటైర్ అయ్యే లోపు హూందాగా వ్యవహరించాలన్నారు. వయసు పెరిగినా బుద్ధి జ్ఞానం లేకుండా కోవిడ్ కేసులు తీవ్రత ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహి స్తామనడం నిమ్మగడ్డ అవివేకానికి నిదర్శనమన్నారు.
హైదరాబాద్‌లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్, జూమ్ బాబులు ఇద్దరు కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరిం చారు.
ఇటీవల చంద్రబాబు, ఎల్లో మీడియా అధినేతలపై కొడాలి నాని విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ వంతు వచ్చింది. కొడాలి నాని తనపై చేసిన ఘాటు విమర్శలను మాత్రం నిమ్మగడ్డ వినలేని రీతిలో ఉన్నాయి.