‘మా’ రచ్చ: అందరికీ కామన్ గా క్లాస్ పీకిన కోట

కోట శ్రీనివాసరావు వ్యవహారశైలి గురించి అందరికీ తెలిసిందే. మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికల రచ్చపై కూడా సూటిగా స్పందించారు కోట. వీళ్లు, వాళ్లు అనే తేడాలేకుండా…

కోట శ్రీనివాసరావు వ్యవహారశైలి గురించి అందరికీ తెలిసిందే. మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికల రచ్చపై కూడా సూటిగా స్పందించారు కోట. వీళ్లు, వాళ్లు అనే తేడాలేకుండా అందరికీ కామన్ గా క్లాస్ పీకారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నాగబాబు, సీవీఎల్.. ఇలా ఎవ్వర్నీ వదల్లేదు.

– అసలు అసొసియేషన్ లో ఎవరు ఎలక్షన్ ఎనౌన్స్ చేశారు..? ఇప్పుడున్న అధ్యక్షుడు చెప్పాడా.. లేక ప్రభుత్వం చెప్పిందా..? ఎవ్వరూ ఎనౌన్స్ చేయకుండా ప్రకాష్ రాజ్ ఎందుకు మీటింగ్ పెట్టాడు? ఏమీ లేకుండా పానెల్ పెట్టడం ఏంటి? ఇప్పుడున్న ప్యానెల్ లో ఉన్నోళ్లు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోకి ఎలా వెళ్లారు..? ప్రస్తుత అధ్యక్షుడికి చెప్పారా? అసలు రిజైన్ చేశారా?

– అసోసియేషన్ లో 900 మంది అటుఇటుగా ఉన్నారు. అందులో ఓటేసేది 500 మంది. ఇది జనాలకు సంబంధించింది కాదు, నటులకు సంబంధించిన విషయం. దానికి ప్రకాష్ రాష్ మీటింగ్ పెట్టడం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టకుండా లెటర్ రాస్తే బాగుండేది. తెలంగాణ ప్రభుత్వంలో అందరూ తెలుసని, భూములు గురించి మాట్లాడానని ప్రకాష్ రాజ్ అంటున్నారు. నాక్కూడా తెలుసు. నేను కూడా కేసీఆర్ తో మాట్లాడగలను. కానీ అది పద్ధతి కాదు. ముందు అసోసియేషన్ లో మాట్లాడాలి.

– నాగబాబుకు ఎందుకిదంతా? ప్రకాష్ రాజ్ ను ఇంత తొందరగా పొగడాల్సిన అవసరం ఏముంది? అసలు ఆయన ఏం ఆశిస్తున్నాడు. నాగబాబు ఇప్పుడే ఎందుకు మాట్లాడారనేది నా ప్రశ్న.

– అసలు ఈ చర్చ ఎందుకు? మీడియాకు ఎందుకింత ఆసక్తి? నరసింహారావు గారు ఎందుకు బయటకొచ్చారు. ఆయనైనా మీటింగ్ కావాలని అడగాల్సింది. ఎవరైనా అడిగితే చాలు 16 ఎకరాలంటూ పాత పాట అందుకుంటాడు. నువ్వు ఆపు నరసింహారావు. ఇదంతా అనవసర చర్చ.

– అందరూ అసోసియేషన్ కు బిల్డింగ్ కావాలంటూ మాట్లాడేవారే. ఇక్కడ స్థలాలున్నాయి, అక్కడున్నాయి అని కబుర్లు చెప్పేవారే. నాకు తెలీదు ఎక్కడ ఎన్ని స్థలాలున్నాయో.. అవన్నీ చెప్పమంటావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో సిటీలో స్థలం ఇవ్వరు. ఊరికి ఆవల 15-20 కిలోమీటర్ల దూరంలో ఇస్తారు. పోయి అక్కడ ఆఫీస్ పెట్టుకుంటారా..? అలాంటప్పుడు ఎందుకీ మాటలు. ఇకనైనా నటులు బయటకొచ్చి మాట్లాడ్డం మానేయాలి. జనాలకు సంబంధం లేని వ్యవహారం ఇది.