లక్షన్నర జీతమన్నా ఉద్యోగాలు వద్దట… ?

చిత్రమే ఇది. ఒక వైపు జాబ్స్ కావాలని ఆందోళను చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. మరో వైపు చూస్తే పిలిచి ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరూ స్పందించని పరిస్థితి. ఈ రెండూ మన పక్కనే ఉన్నాయి. Advertisement…

చిత్రమే ఇది. ఒక వైపు జాబ్స్ కావాలని ఆందోళను చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. మరో వైపు చూస్తే పిలిచి ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరూ స్పందించని పరిస్థితి. ఈ రెండూ మన పక్కనే ఉన్నాయి.

విశాఖ జిల్లాలో చిన్న పిల్లల వైద్యుల కోసం ఆంధ్రా మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్ ని తాజాగా జారీ చేసింది. నెలకు లక్షన్న‌ర జీతం మీద దాదాపు వంద మంది దాకా పిల్లల వైద్యులను తీసుకుంటామని ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.

అర్హులైన వారు హాజరు కావాలని కోరితే ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. దీంతో విస్తుపోవడం ఆంధ్రా మెడికల్ కాలేజ్ నిర్వాహకులది అయింది. ఇదంతా ఎందుకంటే కరోనా మూడవ దశ పొంచి ఉంది. అది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు.

దాంతో ముందస్తు చర్యలలో భాగంగా పిల్లల వైద్యులను పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకోవాలని ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే దీనిని రియాక్షన్ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు ఉన్నారు. 

కరోనా భయమే ఇలా లక్షన్నర క్రేజీ శాలరీ ఆఫర్ ని కూడా పక్కన పెట్టేలా చేసిందన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి కరోనాతో ఒక వైపు ఉద్యోగాలు పోతూంటే మరో వైపు వద్దనుకున్న వారున్నారు అనడానికి ఇది అచ్చమైన ఉదాహరణ మాత్రమే.