ఎకరం పన్నెండు కోట్ల భూమి, రూపాయికే!

కోకాపేట.. హైదరాబాద్ లో దశాబ్దంన్నర కిందట వచ్చిన రియలెస్ట్ బూమ్ కు కేరాఫ్ అడ్రస్!  అలాంటి ప్రాంతంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉండిన రెండెకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం  ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. ప్రభుత్వం ఆ…

కోకాపేట.. హైదరాబాద్ లో దశాబ్దంన్నర కిందట వచ్చిన రియలెస్ట్ బూమ్ కు కేరాఫ్ అడ్రస్!  అలాంటి ప్రాంతంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉండిన రెండెకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం  ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. ప్రభుత్వం ఆ భూమిని శారదాపీఠానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఆ పీఠానికి భూమిని కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అందుకు సంబంధించి భూమిని గుర్తించి, శారదా పీఠానికి కేటాయించడం జరిగింది. ప్రభుత్వాలు ఇలా భూ సంతర్పణలు చేయడం రొటీనే అయ్యింది. ఏపీలో మొన్నటి వరకూ చంద్రబాబు ప్రభుత్వం  విపరీత స్థాయిలో భూ కేటాయింపులు చేసింది. రైతుల  నుంచి భారీ ఎత్తున భూ  సేకరణ చేసి మరీ చంద్రబాబు ప్రభుత్వం పదుల ఎకరాల్లో తను అనుకున్న వారందరికీ సంతర్పణ చేసింది.

ఇలా జరిగే భూ కేటాయింపులు కాదు కానీ, వాటిల్లో పేర్కొంటున్న విలువలే ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. శారదా పీఠానికి కోకాపేట పంచాయితీ పరిధిలో కేటాయించిన భూమి మార్కెట్ విలువ పన్నెండు కోట్ల రూపాయల వరకూ ఉందని సమాచారం. ఆ ప్రాంతంలో ఎకరం భూమికి ఉన్న విలువ అది. దాన్ని శారదా పీఠానికి తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కేటాయించలేదు! దానికో విలువ కట్టి కేటాయించింది. అది రూపాయి!

ఎకరం రూపాయికి విలువ కట్టి తెలంగాణ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించింది. ఆ రూపాయి ధర ఈ కేటాయింపును మరింత హైలెట్ చేస్తూ ఉంది!

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే