కుక్క తోక వంకర అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది తబ్లిగ్ ముఠా. దేశంలో ఇప్పటి వరకూ రిజిస్టర్ అయిన కేసుల్లో 30 శాతం తబ్లిగ్ పుణ్యమే అని గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ శాతం 90 వరకూ ఉంది! తబ్లిగ్ వల్లనే కొన్ని రాష్ట్రాల్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి, వారి వల్లనే ఆ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
అదంతా ఒక ఎత్తు అయితే.. తబ్లిగ్ మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ప్రాంతాలపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించడమే పాపం అవుతోంది. ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయిన చోట్లను రెడ్ జోన్లుగా ప్రకటించి, అక్కడ మరింత జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి చోట పోలీసులు, వైద్య సిబ్బంది పడుతున్న శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే! రెడ్ జోన్లలో సేవలు అందించే వాళ్లకు కరోనా సోకే అవకాశాలూ లేకపోలేదు. అయినా వారు ధైర్యంగా నిలబడుతున్నారు. అలాంటి చోట్ల వాళ్లపై దాడికి దిగితే? ఏమనాలి అలాంటి మూర్ఖులను?
బెంగళూరులో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరులోని పెద్దనారాయణ పుర ప్రాంతంలో ముగ్గురు యువకులకు కరోనా సోకినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంపై వైద్య సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వాళ్లు ముగ్గురూ తబ్లిగ్ వెళ్లి వచ్చిన వారే. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వైద్య సిబ్బంది అక్కడే మకాం పెట్టి, అనుమానితులకు చికిత్సను అందిస్తూ ఉంది.
అది కూడా ఆశా వర్కర్లు. అలాంటి వారిపై ఆదివారం దాడికి తెగబడ్డారు స్థానికులు. వాళ్లు ఏర్పాటు చేసుకున్న టెంట్లను కూల్చేసి తమ మూర్ఖత్వాన్ని చూపించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. పోలీసులు దిగితే కానీ ఇలాంటి వారు చెప్పిన మాట వినే రకం కాదు కదా, మొత్తం 60 మందిపై కేసులు కూడా నమోదు చేశారు, కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ విషయంపై కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా స్పందించారు. వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తబ్లిగ్ ముఠాను కరోనా విషయంలో నిందిస్తున్నారు అని కొందరు బాధపడిపోతున్నారు, మరి ఇలాంటి చర్యలను ఎలా భావించాలి?