రైతు కోసం కాదు.. అధికారం కోసం.. డూప్లికేట్ లోకేష్

ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేసుకుని 'ఏం పీకారు' అంటూ నోరు జారారు లోకేష్. ప్రకాశం జిల్లా నుంచి 'రైతు కోసం' యాత్ర ప్రారంభించిన లోకేష్ బాగా ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. సీఏం…

ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేసుకుని 'ఏం పీకారు' అంటూ నోరు జారారు లోకేష్. ప్రకాశం జిల్లా నుంచి 'రైతు కోసం' యాత్ర ప్రారంభించిన లోకేష్ బాగా ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. సీఏం పై నోరు పారేసుకోవడమే కాకుండా.. దొంగబ్బాయి, దొంగ పేపర్ అంటూ సాక్షిపై కూడా తన అక్కసు వెళ్లగక్కారు.

తాను పరామర్శకు వస్తున్నానని తెలిసి ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న కొంతమంది రైతులకు పరిహారం ప్రకటించారని రెచ్చిపోయారు. 

అసెంబ్లీలో చంద్రబాబు నేలమీద కూర్చుని నిరసన చేయడం వల్లే వైసీపీ రైతుల తరపున పంటలకు బీమా చేయించిందని కూడా గొప్పలు చెప్పుకున్నారు. ఇంకా నయం.. రైతు భరోసా కూడా తమ డిమాండ్ వల్లే అన్నదాతల ఖాతాల్లో పడుతుందని చెప్పలేదు.

ఒక్క కేక వేయండి వచ్చేస్తా..

కరోనా టైమ్ లో హైదరాబాద్ లో కూర్చున్న తండ్రీ కొడుకులు ప్రజల్ని ఎప్పుడో మర్చిపోయారు. స్థానిక ఎన్నికలు ఉన్నాయనో, తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయనో.. అప్పుడప్పుడు ప్రజల్లోకి వస్తుంటారు. 

అలాంటి లోకేష్.. ఒక్క కేక వేయండి నేను మీ ముందుకొచ్చేస్తా అని చెప్పడం విడ్డూరం కాక ఇంకేంటి.  పొలాల్లో రైతుల మోటర్ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించిన లోకేష్.. ఒక్క కేకవేయండి నేనొచ్చేస్తాంటూ ప్రగల్భాలు పలికారు. 

ఇంతకీ కేక వేస్తే వినపడ్డానికి ఆయనేమైనా ఏపీలో ఉంటున్నారా..? పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నారు. ఈ లాజిక్ మర్చిపోతే ఎలా లోకేష్ అని అక్కడ ఉన్నవారే చెవులు కొరుక్కున్నారు.

వర్షాలు పడితే లోకేష్ కి కడుపు మంట..

చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు తాండవిస్తుందని, వర్షాలే పడవనేది రైతుల నమ్మకం. 2014లో అధికారం చేపట్టి ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టారాయన. 

వైఎస్ఆర్ వారసుడిగా జగన్ అధికారంలోకి వచ్చాక వర్షాలు పిలిస్తే పలుకుతున్నాయి. రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండు కుండల్లా మారిపోయాయి. భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. మరో ఐదారేళ్లపాటు రైతులు నీటికోసం ఇబ్బంది పడే పరిస్థితే లేదు.

అలాంటి సంతోషకర సందర్భం లోకేష్ కి నచ్చలేదేమో.. రైతులు అల్లాడిపోతున్నారు, జగన్ ది దరిద్రపు పాదం అంటూ రెచ్చిపోయారు. ఎవరిది ఏ పాదమో ప్రజలే స్పష్టంగా తీర్పునిచ్చిన తర్వాత ఇంకా లోకేష్ తొందరపడటం ఎందుకు? రైతు కోసం అంటూ అధికారం కోసం ఈ డూప్లికేట్ యాత్రలు ఎందుకు..?

'వకీల్‌ సాబ్‌ కాదు.. నువ్వు షకీలా సాబ్‌'

అరియానా నేను మంచి ఫ్రెండ్స్..  పెళ్లి చేసుకోను