పెదబాబు చంద్రబాబు ఆ మధ్య విశాఖ టూర్ వేశారు. రెండేళ్లలో వైసీపీ సర్కార్ ఏ పీకిందంటూ తన అసహనాన్ని అలా చాటుకున్నారు. విశాఖ జనం పిరికివారు అంటూ పనిలో పనిగా ప్రజలనూ నిందించి వెళ్లారు.
ఇపుడు చినబాబు లోకేష్ వంతు. ఆయన కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి తన అక్కసు అంతా బాగానే వెళ్లగక్కుతున్నారు అంటున్నారు. వైసీపీని తరిమికొట్టాలని చినబాబు ఇచ్చిన పిలుపు ఒక కామెడీ అంటున్నారు వైసీపీ నేతలు.
వచ్చింది కార్పోరేషన్ ఎన్నికల ప్రచారానికి. వైసీపీని తరిమికొట్టండి. ఏ వన్, ఏ టూ అంటూ చినబాబు వీరావేశంతో డైలాగులు వదలడమే బహు చిత్రమంటున్నారు. ఎలా కాదన్నా మరో మూడేళ్లకు పైగా వైసీపీ ఏపీలో అధికారంలో ఉండడం ఖాయం. మరో వైపు విశాఖలో కూడా వైసీపీయే నెగ్గుతుంది అన్న బలమైన సంకేతాలు ఉన్నాయి.
ఇలాంటి టైమ్ లో విశాఖ వచిన చినబాబు ప్రత్యేక హోదా ఎందుకు తేలేదూ అని వైసీపీని అమాయకంగా ప్రశ్నించడమే ఒక విడ్డూరం అని అంటున్నారు. ఇక విశాఖకు రాజధానికి ఎలా వస్తుంది అంటూ కూడా లోకేష్ డౌట్ వదిలారు. మొత్తానికి ఎన్నికల ప్రచారమంతా వైసీపీని నిందించడానికే తప్ప వేరే దేనికీ కాదా బాబూ అంటున్నారు వైసీపీ నేతలు.