లోకేశ్ ఉండ‌గా…టిక్‌టాక్ లేద‌నే బెంగ ఎందుకు?

చైనా – భార‌త్ స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు, ప‌ర‌స్స‌న కాల్పులు, మ‌న సైనికుల వీర మ‌ర‌ణం నేప‌థ్యంలో… మ‌రోసారి మ‌న దేశంలో భావోద్వేగాలు ఆకాశాన్నంటాయి. చైనా వ‌స్తువుల‌ను బ‌హిష్క‌రించాల‌ని మ‌న పాల‌కులు పిలుపునిచ్చారు. ఇదే…

చైనా – భార‌త్ స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు, ప‌ర‌స్స‌న కాల్పులు, మ‌న సైనికుల వీర మ‌ర‌ణం నేప‌థ్యంలో… మ‌రోసారి మ‌న దేశంలో భావోద్వేగాలు ఆకాశాన్నంటాయి. చైనా వ‌స్తువుల‌ను బ‌హిష్క‌రించాల‌ని మ‌న పాల‌కులు పిలుపునిచ్చారు. ఇదే క్ర‌మంలో చైనాకి సంబంధించి సోష‌ల్ మీడియా యాప్స్‌ని మ‌న దేశం నిషేధించింది. వీటిలో ప్ర‌ముఖంగా టిక్‌టాక్ యాప్ ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో అత్యంత పాపుల‌ర్ అయిన యాప్ ఇది.

ఫ‌న్నీ వీడియోలు  టిక్‌టాక్‌లో వైర‌ల్ కావ‌డం చూశాం. టిక్‌టాక్ స్టార్స్‌కు సినిమా అవ‌కాశాలు కూడా ద‌క్క‌డం గురించి కూడా విన్నాం. టిక్‌టాక్‌లో ల‌క్ష‌ల సంఖ్య‌లో ఫాలోవ‌ర్స్‌ని క‌లిగిన వారికి పెద్ద మొత్తంలో ఆదాయం కూడా వ‌చ్చేది. టిక్‌టాక్ యాప్ పుణ్యాన కొంత మంది స్టార్స్ సెల‌బ్రిటీ హోదా ద‌క్కించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క‌సారిగా టిక్‌టాక్ యాప్‌ను నిషేధించ‌డంతో జీవితం అంధకార‌మైంద‌ని భావిస్తున్న వాళ్లు లేక‌పోలేదు. అన్నిటికీ మించి ఫ‌న్నీ వీడియోస్ చూస్తూ తెగ ఎంజాయ్‌ చేసేవాళ్లు…తాజాగా స్వ‌దేశీ యాప్స్ వైపు మ‌ళ్లారు.

ఇదిలా ఉండ‌గా టిక్‌టాక్ యాప్ లేని లోటును మ‌న యువ కిశోరం నారా లోకేశ్ తీరుస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే ఆయ‌న జ‌నంలో క‌నిపించేది అరుదు. ట్విట‌ర్‌లో గ‌డిపేదే ఎక్కువ‌. ప్ర‌తి అంశంపై ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గానే త‌న స్టైల్‌లో స్పందిస్తూ…న‌వ్విస్తుంటారు. ఆయ‌న‌లో గొప్ప హాస్య న‌టుడున్నాడు. ఎందుకంటే తాను న‌వ్వ‌కుండా, ఎదుటి వాళ్ల‌ను న‌వ్వించ‌డం గొప్ప క‌ళాకారుల ల‌క్ష‌ణం. ఆ ల‌క్ష‌ణ‌మేదో లోకేశ్‌లో పుష్క‌లంగా ఉన్న‌ట్టుంది.

తాజాగా అలాంటిదే ఒక ట్వీట్ చేశాడాయ‌న‌. ఎప్పుడో ఏడాది క్రితం సీఎంగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి సంబంధించిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను ఇప్పుడు ట్విట‌ర్‌లో ప్ర‌స్తావిస్తూ…జ‌గ‌న్‌ను నిల‌దీయడం న‌వ్వు తెప్పించ‌డంతో పాటు ఆశ్చ‌ర్య‌మేస్తోంది.

‘డ‌బ్బులు మంచినీళ్లలా ఖ‌ర్చు చేశారంటే ఇదే! రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఏపీ ప్రజ‌ల సొమ్ము సీఎం నీళ్లపాలు. సీఎం ఒక మీటింగ్‌లో తాగిన వాట‌ర్‌బాటిళ్లు, మ‌జ్జిగ ప్యాకెట్లు ఖ‌రీదు అక్ష‌రాలా 43.44 ల‌క్షలు. ఒక్కరోజులో ఇంత తాగారంటే అది అమృత‌మైనా అయ్యుండాలి.. లేదంటే స్కామైనా చేసుండాలి. ఏడాది క్రితం జ‌గ‌న్‌రెడ్డి ప్రమాణ‌స్వీకారం రోజున‌ వాట‌ర్ బాటిల్స్‌, స్నాక్స్‌కి 59.49 లక్షలు బిల్లు అయ్యింద‌ట‌! తిన్నవి స్నాక్సా? క‌రెన్సీ నోట్లా జ‌గ‌న్‌రెడ్డి గారూ’ అని  కొన్ని వివరాలతో  నారా లోకేష్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

కాగా గ‌తంలో లోకేశ్ తిండి ఖ‌ర్చు విష‌య‌మై సోష‌ల్ మీడియాలో పేలిన పంచ్‌ల‌ను మ‌రోసారి మ‌న‌సారా ఆస్వాదించాల‌ని లోకేశ్ కోరుకుంటున్న‌ట్టుంది. అందుకే జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం నాటి ఖ‌ర్చు వివ‌రాల‌ను ఇప్పుడు తెర‌పైకి తెచ్చాడ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి లోకేశ్ ఏం చేసినా…ఆయ‌న ముద్ర త‌ప్ప‌క ఉంటోంది. వారెవ్వా లోకేశ్‌…మీరు ట్వీట్ చేయ‌క‌పోతే ఆ రోజు సోష‌ల్ మీడియా కూడా బెంగ పెట్టుకునేలా ఉంది బాసూ!

శర వేగంగా పవర్ స్టార్ షూటింగ్

మోహన్ బాబు కూడా ఫోన్ చేశారు, కానీ నా దేవుడు చెయ్యలేదు