చంద్రబాబు వారసుడు నారా లోకేష్ రాజకీయ గాలి విశాఖ వైపు తిరుగుతోందా. ఆయన చూపు ఉత్తరాంధ్రా వైపు ఉందా అంటే అవును అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది.
వైసీపీతో పాటు లోకేష్ కూడా ఈ మధ్య విశాఖను బాగా లవ్ చేస్తున్నాడు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తరచూ ఆయన విశాఖ టూర్ చేస్తున్నారు. అంతే కాదు విశాఖ నుంచే తన రాజకీయ జీవితాన్ని సరిదిద్దుకోవాలని కూడా చూస్తున్నారుట.
విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి లోకేష్ అని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్న టాక్ అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎంపీ సబ్బం హరి ఈ మధ్యనే మరణించడంతో ఇక్కడ టీడీపీకి క్యాండిడేట్ అంటూ ఎవరూ లేరు అనే చెప్పాలి.
నిజానికి లోకేష్ గత ఎన్నికల్లోనే భీమిలీ నుంచి పోటీ చేయాలి. అందుకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ కి షిఫ్ట్ అయ్యారు. చివరి నిముషంలో లోకేష్ మంగళగిరికి మారిపోయారు, ఓడిపోయారు,
దాంతో టీడీపీకి సేఫేస్ట్ ప్లేస్ ఎక్కడా అని వెతుకుతున్న క్రమంలో మరోమారు టీడీపీలో భీమిలీ చర్చకు వస్తోందిట. విశాఖను పాలనారాజధానిగా చేసుకుకుని పాలించేందుకు ఒక వైపు జగన్ రెడీ అవుతూంటే లోకేష్ చూపు కూడా ఇదే జిల్లా మీద పడడం విశేషమే.
మొత్తానికి లోకేష్ భీమిలీ నుంచి పోటీ పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది కూడా చూడాల్సిందే. ఇక్కడ నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.