ఏపీ సీఎం సలహాదారుగా లోకేశ్వర్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన తుమ్మల లోకేశ్వర్‌ రెడ్డిని టెక్నికల్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి.  Advertisement సాంకేతికంగా ఉన్నతస్థాయి విద్యార్హతలు, యాపిల్‌…

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన తుమ్మల లోకేశ్వర్‌ రెడ్డిని టెక్నికల్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 

సాంకేతికంగా ఉన్నతస్థాయి విద్యార్హతలు, యాపిల్‌ వంటి కంపెనీలకు పనిచేసిన అనుభవం ఇవన్నీ ఆయన్ను సాంకేతిక ప్రాజెక్టుల సలహాదారుని చేశాయని చెప్పాలి. 

టి.లోకేశ్వర్‌ రెడ్డి… బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేశాక ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌ చేశారు. దాదాపు 15 ఏళ్లకు పైగా బిగ్‌ డేటా, క్లౌడ్, డేటా అనలిటిక్స్, డేటా వేర్‌హౌసింగ్, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో పని చేసి మేనేజిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (ఎంఐఎస్‌) రూపొందింటంలో నైపుణ్యం సాధించారు. 

ఐఐఎం బెంగళూరు నుంచి ఎంట్రప్రెన్యూర్స్, ఫామిలీ బిజినెస్‌కు సంబంధించిన మేనేజిమెంట్‌ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తి చేసిన లోకేశ్‌… కొన్నేళ్లపాటు యూకే, యూఎస్‌లలో ఉండి… యాపిల్, జేపీ మోర్గాన్‌ చేజ్, అవీవా, ఫిలిప్స్, ఏటీ అండ్‌ టీ, లీగల్‌ అండ్‌ జనరల్, లాండ్‌మార్క్‌ వంటి అంతర్జాతీయ క్లయింట్లకు పనిచేశారు.  

తాను సొంతగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఎన్నికల జాబితాల్లో భారీ ఎత్తున డూప్లికేట్‌ ఓటర్లను గుర్తించటంతో పాటు ఆ తప్పుల్ని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లారు.

ఒకరకంగా ఏపీ, తెలంగాణల్లో ఒకే రోజున పోలింగ్‌ జరగటానికి ఇదే కారణం కూడా. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ ద్వారా తెలుగుదేశం పార్టీ జనం డేటాను దుర్వినియోగం చేయటాన్ని ప్రశ్నించటమే కాక… దానిపై ఫిర్యాదు చేయటం ద్వారా ఈయన గతంలో వార్తలకెక్కారు.