దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఈ క్రమంలోనే గ్యాస్ ధర అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏపీలో గ్యాస్ ధర పెరిగిపోయిందంటూ తెలుగుదేశం పార్టీ హడావుడి చేస్తూ ఉంది. నారా లోకేషుడు ట్వీట్లు కూడా వేసేశాడు. ఇంతకీ ఈ గ్యాస్ కథేంటి? అంటే.. అంతా గ్యాస్ అనే మాట వినిపిస్తూ ఉంది.
కామన్ సెన్స్ ఉండే ప్రశ్న ఏమిటంటే.. వంట గ్యాస్ ధర రాష్ట్రం పరిధిలోనిదా? అసలు ఇప్పుడు వంట గ్యాస్ ను ఏ పద్ధతిలో ఇస్తున్నారు? సబ్సిడీలను స్వయంగా కేంద్రమే ఎత్తేసింది కదా, నగదు బదిలీ అని అంటున్నారు. అది అనడం వరకే! చాలా మందికి ఆ అందుకు సంబంధించిన నగదు జమ జరగడమే లేదు! ఇన్ కామ్ రిటర్న్స్ ఫైల్ చేస్తే చాలు.. ఆ నగదు బదిలీని ఎత్తేసినట్టుగా ఉన్నారు. ఇదో ప్రహసనం.
ఇక వంట గ్యాస్ పై వ్యాట్ పెరిగిందంటూ తెలుగుదేశం రాద్ధాంతం చేస్తూ ఉంది. ఇంతకీ వ్యాట్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్) ఉందా? మరి అలాగైతే జీఎస్టీ ఏమిటి? జీఎస్టీ వచ్చాకా కూడా వ్యాట్ పెరిందనడంలో లాజిక్ ఏమిటో లోకేషే చెప్పాలి.
మరోవైపు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వంటగ్యాస్ ధర పెరగలేదు, అది కేంద్ర పరిధిలోనిది అని స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ స్పందించారు. వంట గ్యాస్ ధర పెరిగిందంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. న్యాచురల్ గ్యాస్ ధరలు పెరిగితే ఎల్పీజీ ధర పెరిగిందని ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఎల్పీజీ ధరను రాష్ట్రం పెంచే అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు. పరిశ్రమలకూ, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే న్యాచురల్ గ్యాస్ ధరలు మాత్రమే పెరిగాయని, వాటికీ.. వంట గ్యాస్ కూ సంబంధమే లేదని ఆయన తేల్చి చెప్పారు.