ప్రేమలో పడనంతవరకు హీరోయిన్లంతా చెప్పే డైలాగ్ ఇదే. డేటింగ్ మొదలుపెట్టనంతవరకు ముద్దుగుమ్మల కామన్ స్లోగన్ ఇదే. ప్రస్తుతం సోలో లైఫ్ బాగుందని, బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతుంటారు. హీరోయిన్ మాళవిక శర్మ కూడా దీనికి అతీతం కాదు. తను కూడా సింగిల్ అంటోంది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్.
“నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్మను. అలా అని డేటింగ్ లో కూడా లేను. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. సోలో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా నేను ప్రేమలో పడతానని, డేటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పలేను.”
తనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయంటోంది మాళవిక శర్మ. ఎవ్వరిపై ఆధారపడొద్దని, స్వతంత్రంగా జీవించాలని తన తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుంటారని, తను అవే రూల్స్ ఫాలో అవుతుంటానని అంటోంది. అందుకే ఓవైపు ఫిల్మీ కెరీర్ కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు కష్టపడి చదివి అడ్వకేట్ అయ్యానని అంటోంది.
భవిష్యత్తులో కూడా సినిమాలు కొనసాగిస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. లాయర్ ప్రాక్టీస్ చేస్తూనే సినిమాల్లో నటిస్తానని, యాక్టింగ్ ను వదిలేది లేదని స్పష్టంచేసింది. నేలటిక్కెట్ తో ఎంట్రీ ఇచ్చిన మాళవిక, రీసెంట్ గా రెడ్ సినిమాలో నటించింది.