దారుణం.. ఫస్ట్ నైట్ రోజే భార్య హత్య

వందేళ్ల జీవితాన్ని ఊహించుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఆ యువతి, పెళ్లయిన రెండో రోజే ప్రాణం కోల్పోయింది. మొదటి రాత్రే ఆమెకు చివరి రాత్రి అయింది. కట్టుకున్న మొగుడే, యముడై ఆమె ప్రాణాలు తీశాడు.…

వందేళ్ల జీవితాన్ని ఊహించుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఆ యువతి, పెళ్లయిన రెండో రోజే ప్రాణం కోల్పోయింది. మొదటి రాత్రే ఆమెకు చివరి రాత్రి అయింది. కట్టుకున్న మొగుడే, యముడై ఆమె ప్రాణాలు తీశాడు. ట్విస్ట్ ఏంటంటే.. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన క్రేన్ ఆపరేటర్ నిధివాసన్ కు, సమీప బంధువు సంధ్యతో పెళ్లయింది. లాక్ డౌన్ వల్ల జూన్ 10న సింపుల్ గా వీళ్ల పెళ్లి జరిపించారు. అదే రోజు శోభనం ఏర్పాటుచేశారు.

అయితే అర్థరాత్రి 12 గంటల సమయంలో గది నుంచి యువతి అరుపులు వినిపించాయి. ఈ విషయాన్ని బంధువులు పెద్దగా పట్టించుకోలేదు. ఉదయం లేచిన వెంటనే కొత్త పెళ్లి కొడుకు నిధివాసన్ గట్టిగా అరుస్తూ గది నుంచి బయటకు పరుగులుతీశాడు.

అనుమానంతో బంధువులు గదిలో చూడగా యువతి శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఓవైపు పోలీసులు నిధివాసన్ గురించి వెదుకుతుండగానే, అతడు గ్రామానికి కొద్ది దూరంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ మొత్తం వ్యవహారంలో తప్పు పెళ్లికొడుకుదే అంటున్నారు పోలీసులు. ప్రాధమిక విచారణలో తేలిందేంటంటే.. నిధివాసన్ కు ఆల్రెడీ గంజాయి, మద్యం అలవాటు ఉంది. మెంటల్ పేషెంట్ గా మారిన అతడు 3 నెలల పాటు ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నాడు. పెళ్లయితే దారిలోకొస్తాడని పెళ్లి చేశారు. ఫస్ట్ నైట్ రోజున అతడు గంజాయి తీసుకొని, మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

నువ్వు ఎలాంటోడివో మీ అబ్బాయే చెప్పాడు