అక్రమ సంబంధంలో మరో అక్రమ సంబంధం

పెట్టుకున్నదే అక్రమ సంబంధం. దాన్ని కొనసాగిస్తూనే మరో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో చివరికి అది ఒకరి హత్యకు దారి తీసింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ ఘటనలో తప్పు ఒకరిదే అని చెప్పడం…

పెట్టుకున్నదే అక్రమ సంబంధం. దాన్ని కొనసాగిస్తూనే మరో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో చివరికి అది ఒకరి హత్యకు దారి తీసింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ ఘటనలో తప్పు ఒకరిదే అని చెప్పడం కొంచెం కష్టమే.

కుత్బుల్లాపూర్ లోని భాగ్యలక్ష్మి కాలనీలో పోచమ్మ, కృష్ణ సహజీవనం చేస్తున్నారు. మెదక్ జిల్లా నుంచి వీళ్లిద్దరూ లేచి వచ్చేశారు. వీళ్లు ఉంటున్న నివాసానికి పక్కనే ఓ భవన నిర్మాణం జరుగుతోంది. మాధవరావు అనే మేస్త్రి దాన్ని నిర్మిస్తూ, అక్కడే నివశిస్తున్నాడు. ఈ క్రమంలో పోచమ్మతో అతడికి పరిచయమైంది.

రోజులు గడిచేకొద్దీ పోచమ్మ-మాధవరావు చాలా క్లోజ్ అయ్యారు. వీళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం మొదలైంది. ఓవైపు కృష్ణతో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే, మాధవరావుతో కూడా శారీరక సంబంధం పెట్టుకుంది పోచమ్మ.

కొన్ని రోజుల పాటు ఈ మూడు ముక్కలాట సజావుగానే సాగింది. ఎప్పుడైతే కృష్ణకు అనుమానం వచ్చిందో అప్పట్నుంచి అసలు కథ మొదలైంది. పోచమ్మపై బాగా అనుమానం పెంచుకున్న కృష్ణ, తన అనుమానాన్ని నిజం చేసుకోవాలని భావించాడు. ఓరోజు ఊరికి వెళ్లొస్తానని పోచమ్మకు చెప్పి బయల్దేరాడు. కానీ అతడు ఊరు వెళ్లలేదు. ఇంటిపై నిఘా వేశాడు.

సడెన్ గా ఇంట్లోకి వచ్చి చూస్తే పోచమ్మ లేదు. పక్కనే ఉన్న మాధవరావు ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కనిపించారు. దీంతో ఆగ్రహం పట్టలేని కృష్ణ, మాధవరావును హత్య చేసి పరారయ్యాడు.

నిమ్మగడ్డకి పదవొచ్చింది పని లేదు