అక్రమం సంబంధం.. ప్రియుడిపై దారుణం

అక్రమ సంబంధం తెచ్చిన అనర్థాల్లో ఇది మరో కోణం. ఒకే ఒక్క అమ్మాయి. ఒకవైపు అక్రమ సంబంధం.. మరోవైపు ప్రేమాయణం.. ఈ మూడు ముక్కలాటలో ప్రియుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లో జరిగింది…

అక్రమ సంబంధం తెచ్చిన అనర్థాల్లో ఇది మరో కోణం. ఒకే ఒక్క అమ్మాయి. ఒకవైపు అక్రమ సంబంధం.. మరోవైపు ప్రేమాయణం.. ఈ మూడు ముక్కలాటలో ప్రియుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.

ఆల్వాల్ లో కనకరాజు అనే వ్యాపారవేత్త, తన ప్రాంతానికే చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే అదే యువతిని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమించాడు. కొన్నాళ్ల పాటు ఒకరికి తెలియకుండా ఒకరితో ఈ వ్యవహారం బాగానే నడిచింది.

అయితే ఓ రోజు జరిగిన ఘటన ఈ విషయాన్ని బయటపడేలా చేసింది. సదరు యువతిని శ్రీకాంత్ రెడ్డి బయటకు తీసుకెళ్లాడు. ఆ విషయం కనకరాజుకు తెలిసింది. దీంతో వివాదం మొదలైంది. యువతికి, శ్రీకాంత్ రెడ్డికి, కనకరాజుకు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో.. మాట్లాడదామని ఇద్దర్నీ పిలిచిన కనకరాజు వాళ్లను నిర్బంధించాడు. ఓ ఇంట్లో పెట్టి తాళం వేశాడు. 10 రోజులుగా శ్రీకాంత్ రెడ్డిని హింసించాడు.

కనకరాజు దెబ్బలకు తాళలేక శ్రీకాంత్ రెడ్డి మరణించాడు. దీంతో మూడో కంటికి తెలియకుండా కనకరాజే, శ్రీకాంత్ ను స్మశానవాటికకు తీసుకెళ్లి పూడ్చిపెట్టాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు జరిగిన ఓ మందు పార్టీలో.. తాగి తన గుట్టును తానే స్నేహితుల వద్ద బయటపెట్టాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు కనకరాజును అదుపులోకి తీసుకున్నారు. పూడ్చిపెట్టిన శ్రీకాంత్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపించారు. 

అటూ ఇటూ ఎటూ కాలేక!