అన్నాచెల్లెల బంధానికి మచ్చతెచ్చాడు ఓ కామాంథుడు. చెల్లెలు అంటూ దగ్గరయ్యాడు. ఎవ్వరూ లేని సమయం చూసి తనలోని కామం తీర్చుకోవడానికి బరితెగించాడు. బండారం బయటపడ్డంతో ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఈ ఘటన.
ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఓ అమ్మాయికి దగ్గరయ్యాడు. చెల్లీ అని పిలవడంతో అమ్మాయి కూడా నమ్మింది. యువతి తల్లిదండ్రులకు కూడా అనుమానం రాలేదు. కొన్నాళ్ల పాటు అంతా సజావుగానే సాగింది. ఓ రోజు యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు.
ఇంట్లో ఎవరూ లేరనే విషయం గ్రహించిన యువకుడు.. అమ్మాయిని తన కోరిక తీర్చమని బలవంతం పెట్టాడు. షాక్ అయిన యువతి అందుకు అంగీకరించలేదు. దీంతో అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే యువతి అరవడంతో ఆమె గొంత కూడా కోశాడు.
అయితే అప్పటికే చుట్టుపక్కల వ్యక్తులకు ఈ అరుపులు వినిపించడంతో ఏం చేయాలో పాలుపోక యువకుడు తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన గొంతును తానే కోసుకున్నాడు. చుట్టుపక్కల జనాలు ఇంట్లోకి వెళ్లి చూడగా.. యువతీ యువకులు ఇద్దరూ రక్తం మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఇద్దర్నీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు స్థానికులు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. యువకుడు కోలుకున్న తర్వాత అతడ్ని అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు.