రాజుల కోటలో కొత్త ట్విస్ట్?

విజయనగరం పూసపాటి రాజుల వారసత్వం, ఆస్తుల వ్యవహారం  ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. గత మూడు నెలల వరకూ తెరచాటు పోరాటాలకే పరిమితం అయినదంతా ఇపుడు సంచయిత గజపతిరాజుకు మాన్సాస్ పగ్గాలు అప్పగించడంతో …

విజయనగరం పూసపాటి రాజుల వారసత్వం, ఆస్తుల వ్యవహారం  ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. గత మూడు నెలల వరకూ తెరచాటు పోరాటాలకే పరిమితం అయినదంతా ఇపుడు సంచయిత గజపతిరాజుకు మాన్సాస్ పగ్గాలు అప్పగించడంతో  ఒక్కొక్క‌టిగా బహిరంగమవుతున్నాయి.

నాలుగేళ్ళ క్రితం దివంగతులైన ఆనందగజపతిరాజుకు తామే అసలైన వారసులమని ఆయన రెండవ భార్య సుధాగజపతిరాజు, వారి అమ్మాయి ఊర్మిళాగజపతిరాజు తెరముందుకు రావడంతో రాజుల కోట రచ్చ సరికొత్త మలుపు తిరిగన‌ట్లైంది.

మార్చి నెలలో ఆనందగజపతిరాజు మొదటి భార్య  ఉమాగజపతిరాజు పెద్ద కుమార్తె సంచయితగజపతిరాజును మాన్సాస్ ట్రస్ చైర్ పర్సన్ గా, అదే విధంగా సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియ‌మిస్తూ రాష్ట్ర‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విధితమే.

అంతవరకూ ఈ రెండు కీలకమైన బాధ్యతలు చూసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఒక్కసారిగా  మాజీ అయిపోయారు. ఆయన ఈ విషయంలో కోర్టుకు ఎక్కారు. తానే అసలైన వారసుణ్ణి అని అక్కడ వాదనలు వినిపిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు సుధా, ఊర్మిళాగజపతిరాజుల రంగప్రవేశంతో కధ మొత్తం మారుతోంది.

1991లోనే ఆనందగజపతిరాజు సంచయితగజపతిరాజు తల్లి ఉమాగజపతిరాజుకు విడాకులు ఇచ్చారని, నాడే ఆస్తిపంపకాలు మొత్తం పూర్తి అయ్యాయని, వారికి పూసపాటి సంస్థానంతో, వారసత్వంతో ఏ రకమైన సంబంధం లేదని తల్లీ కూతుళ్ళు సుధా, ఊర్మిళ‌ అంటున్నారు. తామే అసలైన వారసులమని చెబుతున్నారు.

వారసత్వ హక్కుల కోసం తాము న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు. మొత్తానికి చూస్తే పూసపాటి వారి అనువంశిక వారసత్వం ఎవరికి దక్కుతుంది, ఎవరు నిజమైన వారసులు, అశోక్ గజపతి చెప్పినట్లుగా ఆయనే మళ్ళీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అవుతారా. ఇవన్నీ ప్రశ్నలే. మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారంతో రాజుల కోటలో రచ్చ సంచలనం రేపుతోంది.

బాబు లోకేష్.. వణుకు పుడుతోందా?