ప్రభుత్వ ఉద్యోగులు అంటే చాలా మందికి ఎంతో కొంత వ్యతిరేక భావం ఉంది అంటారు. కొంతమంది ఉద్యోగులు అవినీతికి పాల్పడతారని, సరైన టై, కి ఆఫీసులకు రారు అని, రెడ్ టేపిజం లాంటి వాటి మీద బాగానే కంప్లైట్స్ వినిపిస్తారు.
అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు పోరాడితే సమాజం నుంచి పెద్దగా మద్దతు లభించదు అని కూడా ఒక అంచనా వేసుకున్న వారూ ఉన్నారు. అయితే సమాజంలోని వివిధ సెక్షన్ల అభిప్రాయం ఎలా ఉన్నా వారికి అనూహ్యమైన మద్దతు అయితే లేటెస్ట్ గా లభించింది.
ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించిన పీయార్సీ బాగులేదని, అలాగే ఆర్ధిక పరమైన చాలా అంశాల్లో తమ డిమాండ్లను తీర్చాలని ఉద్యోగులు కోరుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో వారికి మావోయిస్ట్ పార్టీ మద్దతు ప్రకటించడం విశేష పరిణామంగానే చూడాలి.
ఆంధ్రా ఒడిషా బోర్డర్ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి గణేష్ పేరిట తాజాగా విడుదల అయిన ఒక ప్రకటనలో ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి తమ పూర్తి మద్దతు అని తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధించడానికి తమ పూర్తి సపోర్ట్ ఉంటుందని గణేష్ ప్రకటించారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగవద్దని గణేష్ సూచించడం గమనార్హం. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం రాజీ లేని పోరాటం చేయాలని ఆయన పిలుపు ఇవ్వడం విశేషం. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన లేఖ ఒకటి విశాఖ ఏజెన్సీ సహా జిల్లా అంతటా వైరల్ అవుతోంది.