హైటెక్ మోసం.. కరోనాతో బయటపడిన వ్యవహారం

మోసాల్లో ఇదొక రకమైన హైటెక్ మోసం. ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా హాస్పిటల్ తెరిచారు. వైద్యులమని నమ్మించి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఏకంగా కరోనా చికిత్సలు మొదలుపెట్టారు. ఈ హైటెక్ మోసం ఏ మారుమూల ప్రాంతంలోనో జరిగితే…

మోసాల్లో ఇదొక రకమైన హైటెక్ మోసం. ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా హాస్పిటల్ తెరిచారు. వైద్యులమని నమ్మించి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఏకంగా కరోనా చికిత్సలు మొదలుపెట్టారు. ఈ హైటెక్ మోసం ఏ మారుమూల ప్రాంతంలోనో జరిగితే అదో లెక్క. కానీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరిగింది. అదే విచిత్రం.

హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్, మెహిదీపట్నం మెయిన్ రోడ్డులో సమీర్ హాస్పిటల్ ఉంది. దాదాపు మూడేళ్లుగా అది నడుస్తోంది. రోగులు వెళ్తున్నారు.. ఇంజెక్షన్లు చేయించుకుంటున్నారు.. వస్తున్నారు. తాజాగా ఇందులో ఐసొలేషన్ వార్డులు ఏర్పాటుచేసి కరోనా ట్రీట్ మెంట్ కూడా మొదలుపెట్టారు. రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు.

అయితే సరిగ్గా ఇక్కడే వ్యవహారం బెడిసికొట్టింది. కరోనా చికిత్సకు ఉపయోగించే ఇంజెక్షన్లను ఎక్కువ రేటుకు అమ్ముతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు, అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వచేసిన మందుల్ని, కొన్ని పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది. అసలు వ్యవహారం ఇక్కడే మొదలైంది. సదరు హాస్పిటల్ లోని వైద్యుల సర్టిఫికెట్లను తనిఖీ చేయగా అసలు మోసం బయటపడింది. అసలు వీళ్లు డాక్టర్లే కాదని తేలింది. హాస్పిటల్ పెట్టిన అబ్దుల్ ముజీబ్, సోహెబ్ సుభానీలు కేవలం పదో తరగతి మాత్రమే పాసయ్యారు.

నకిలీ సర్టిఫికెట్లతో ఏకంగా హాస్పిటల్ పెట్టేశారు. మరికొంతమంది జూనియర్ డాక్టర్లను కూడా రిక్రూట్ చేసుకొని వైద్యం స్టార్ట్ చేశారు. మూడేళ్లుగా సాగుతున్న ఈ మోసం కరోనాతో బయటపడింది. వీళ్లిద్దరితో పాటు మరో ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్ కు తాళం పడింది. 

చిలుకూరు ఆల‌యంలో అద్భుతం